కరోనా థర్డ్‌వేవ్ రాకుండా వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాలి: ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో మోడీ భేటీ

By narsimha lodeFirst Published Jul 13, 2021, 2:49 PM IST
Highlights


ప్రధాని నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో మంగళవారం నాడు భేటీ అయ్యారు.  వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎనిమిది రాష్ట్రాల సీఎంలతో  మోడీ చర్చించారు. కరోనా నివారణపై ఆయన  చర్చించారు.
 


న్యూఢిల్లీ: దేశంలో కరోనా మూడో వేవ్ రాకుండా నిలిపివేయడానికి  వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని  ప్రధాని నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రాల సీఎంలను కోరారు.మంగళవారం నాడు ఎనిమిది రాష్ట్రాల సీఎంలతో  ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు.కరోనా థర్డ్‌వేవ్ రాకుండా నిలిపివేసేందుకు మనమంతా కలిసి పనిచేయాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంపై ఆయన సీఎంలతో చర్చించారు.

కరోనా వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం  చేయాలని ఆయన కోరారు.  అస్సాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల సీఎంలతో ఆయన చర్చించారు.కరోనా పరీక్షలు, చికిత్సలకు సంబంధించిన మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో  ఆరోగ్య మౌళిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు  కేబినెట్  23 వేల కోట్ల ప్యాకేజీని ఆమోదించింది.

కొండ ప్రాంతాల వద్ద రద్దీపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటక రంగం, వ్యాపారం భాగా ప్రభావితమయ్యారని చెప్పారు.కొండ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు లేకుండా బహిరంగంగా  తిరగడంపై సరైందికాదన్నారు పీఎం. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు భారీగా తగ్గినా ఈశాన్య ప్రాంతంలో  కరోనా కేసులు పెరుగుతున్నాయి.  కరోనా కేసులు భారీగా పెరగడంపై ఆందోళన కల్గిస్తోందని నిపుణులు హెచ్చరించారు. దీంతో ప్రధాని మోడీ ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో  చర్చించారు.

click me!