
ముంంబయి: ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఏర్పాటు చేసిన ముంబయిలని ఓ ప్రత్యేక కోర్టు మహా వికాస్ అఘాదీ ప్రభుత్వానికి ఈడీ రక్షణ కల్పించాలని వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. బ్లాంకెట్ ప్రొటెక్షన్‌ను ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. మహా వికాస్ అఘాదీకి సంబంధించినన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ముందస్తుగా బెయిల్ ఇవ్వాలని ఆ పిటిషన్ కోరింది.
ఈ పిటిషన్ ముంబయిలో కోర్టులో ఫైల్ అయినప్పుడు మహారాష్ట్రలో మహా వికాస్ అఘాదీ ఫ్యామిలీ ఉండేది. అదే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటున్నది.
పిటిషనర్లు కోరుకుంటున్న ముందస్తు బెయిల్ అభ్యర్థనను ఆమోదించలేమని ప్రత్యేక జడ్జీ ఎంజీ దేశ్‌పాండే స్పష్టం చేశారు. అసలు అప్లికేంట్ల మీద ఎలాంటి బలమైన కేసులు లేవని, అలాంటప్పుడు మధ్యంతర లేదా తుది దశ బెయిల్ అప్లికేషన్లు ఎలా విచారిస్తాం అని ప్రశ్నించారు. అప్లికేంట్లు కూడా అరెస్టును ఎదుర్కొనే ముప్పు లేదని తెలుస్తున్నదని తెలిపారు. అదీగాక, ఈ పిటిషన్ ద్వారా వారు ఈ ముందస్తు బెయిల్‌ను థర్డ్ పార్టీకి ఇవ్వాలని కోరుతుండటం గమనార్హం. ఈ పిటిషన్‌పై సానుకూల తీర్పు వెలువడితే అది తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉన్నదని వివరించారు.
ఇంతకీ ఆ పిటిషన్‌లో ప్రధానంగా ఏమున్నదంటే..? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ వంటి వాటిని ఉపయోగించుకుని ఎన్సీపీ, కాంగ్రెస్,శివసేన నేతలపై కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని ఆరోపించింది. బీజేపీ నేతలు సుబ్రమణ్య స్వామి, దేవేంద్ర ఫడ్నవీస్, కిరిత్ సోమయలు ఇప్పటికే తమ కూటమి సభ్యులపై నకిలీ ఫిర్యాదులు ఇచ్చాారని తెలిపింది. ఈ ఫిర్యాదుకు సమాధానంగా కేంద్రం ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఉపయోగించింది కూడా అని వివరించింది. ఈ పిటిషన్‌లోనే మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్, క్యాబినెట్ మంత్రి నవాబ్ మాలిక్‌లను ప్రస్తావించింది. ఈ విషయమై కోర్టు ఈడీకి నోటీసులు పంపింది. కానీ, ఈడీ ఆ నోటీసులను పెడచెవిని పెట్టింది.
ఈ పిటిషన్‌ను ముగ్గురు ముంబయి రీజినల్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు వేశారని జడ్జీ దేశ్‌పాండే తెలిపారు. ముంబయి రీజనిల్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడి లేఖ తప్పితే తమ దగ్గరా ఎలాంటి ఆధారాలు లేవని వివరించారు. మరో విషయం ఏమిటంటే.. ముంబయి రీజినల్ కాంగ్రెస్ కమిటీ అథారిటీ లెటర్ తప్పితే.. ఆ పిటిషన్‌కు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు సంబంధం ఉన్నదా? లేదా? అనే విషయం కూడా స్పష్టంగా తెలియదని చెప్పారు. ఈ మూడు పార్టీల నేతలు ముంబయి రీజిన్ కాంగ్రెస్ కమిటీ ద్వారా తమ గళం విప్పాలని నిజంగానే కోరుకుంటున్నారా? దీనికి ధ్రువీకరణ లేదని పేర్కొన్నారు.