భారత్ లో కరోనా.. 24గంటల్లో 90వేల కేసులు

By telugu news teamFirst Published Sep 9, 2020, 10:50 AM IST
Highlights

గత 24గంటల్లోనూ దాదాపు 90వేల కొత్త కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. మొత్తం కేసులు 43లక్షల మార్క్ ని దాటేశాయి. భారత్ లో మొత్తం 43,70,128 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

కరోనా మహమ్మారి భారత్ లో విజృంభిస్తోంది. రోజు రోజుకీ పెరుగుతుందే తప్ప.. తగ్గడం లేదు. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి. ఇప్పటికే..  ప్రపంచ వ్యాప్తంగా నమోదౌతున్న కరోనా కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానానికి చేరుకుంది. అంతకముందు బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా.. దానిని భారత్ వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని అక్రమించింది.

కాగా.. గత 24గంటల్లోనూ దాదాపు 90వేల కొత్త కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. మొత్తం కేసులు 43లక్షల మార్క్ ని దాటేశాయి. భారత్ లో మొత్తం 43,70,128 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

కాగా.. 24గంటల్లో ఈ కరోనా వైరస్ కారణంగా 1,115 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.  మొత్తం మరణాలు 73,890కి చేరుకున్నాయి. కాగా.. ఇప్పటి వరకు 33లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా.. దేశంలో రికవరీ రేటు 77.32 శాతం గా ఉంది. 

ఇదిలా ఉండగా.. దేశంలో ఇప్పటి వరకు 5కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు  చెబుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ  కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజూ పదివేలకు పైగా కేసులు నమోదౌతున్నాయి. తెలంగాణలోకాస్త కోలుకున్నట్లు కనిపిస్తోంది. 

click me!