చెక్ బౌన్స్ కేసు: మిత్రుడి పక్కా ప్లానింగ్‌కు దొరికిపోయిన రాహుల్ ప్రత్యర్థి

By Siva KodatiFirst Published Aug 22, 2019, 6:52 PM IST
Highlights

కేరళకు చెందిన అజ్మాన్‌లో స్ధిరపడిన వ్యాపారి నాసిల్ అబ్దుల్లాకు రూ.19 కోట్ల విలువ చేసే చెక్‌లను తుషార్ ఇచ్చారు. అయితే అంత డబ్బు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో పదేళ్ల నుంచి దీనిపై వేచి చూసిన నాసిల్ అబ్థుల్లా పక్కా పథకం ప్రకారం తుషార్‌ను అజ్మాన్‌కు రప్పించి.. ఓ హోటల్లో దింపాడు

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీపై వయ్‌నాడ్ నుంచి పోటీ చేసిన ఎన్డీఏ అభ్యర్ధి తుషార్ వెల్లపల్లి అరెస్టయ్యారు. వివరాల్లోకి వెళితే... తుషార్ వెల్లపల్లి కొంతమంది సన్నిహితులతో కలిసి దుబాయ్‌లో పదిహేనేళ్ల క్రితం ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించారు.

అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆ కంపెనీని అమ్మేశారు. ఈ సమయంలో కేరళకు చెందిన అజ్మాన్‌లో స్ధిరపడిన వ్యాపారి నాసిల్ అబ్దుల్లాకు రూ.19 కోట్ల విలువ చేసే చెక్‌లను తుషార్ ఇచ్చారు.

అయితే అంత డబ్బు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో పదేళ్ల నుంచి దీనిపై వేచి చూసిన నాసిల్ అబ్థుల్లా పక్కా పథకం ప్రకారం తుషార్‌ను అజ్మాన్‌కు రప్పించి.. ఓ హోటల్లో దింపాడు.

అప్పటికే స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడంతో హోటల్‌కు చేరుకున్న పోలీసులు తుషార్‌ను అరెస్ట్ చేశారు. అయితే తుషార్ ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా చట్ట ప్రకారం కొంత ఉపశమనం కలిగేలా చూడాలని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు. 
 

click me!