బీజేపీ లీడర్ చెంప చెల్లుమనిపించిన ఎన్సీపీ వర్కర్.. వీడియో వైరల్

By Mahesh KFirst Published May 15, 2022, 6:08 PM IST
Highlights

బీజేపీ నేతపై కొందరు ఎన్సీపీ వర్కర్లు బెదిరింపులకు పాల్పడ్డారు. శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టారని ఓ కార్యకర్త ఏకంగా ఆయన చెంపపై కొట్టారు. ఈ ఘటన వీడియోలో రికార్డు అయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నది.
 

ముంబయి: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌పై సోషల్ మీడియాలో పోస్టు చేసిన బీజేపీ వినాయక్ అంబేకర్‌ను ఎన్సీపీ కార్యకర్తలు బెదిరించారు. ఆయన కార్యాలయానికి వెళ్లి చెంపపై కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోను రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. 

ఈ వీడియోలో కొందరు ఎన్సీపీ వర్కర్లు.. బీజేపీ నేత అంబేకర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆయన సెల్ ఫోన్ పట్టుకుని ఉన్నారు. సోషల్ మీడియాలో శరద్ పవార్‌కు వ్యతిరేకంగా చేసిన పోస్టుపై ఎన్సీపీ కార్యకర్తలు నిలదీశారు. అందులో ఒక కార్యకర్త.. మరికొంత ముందుకు జరిగి వినాయక్ అంబేకర్ చెంప చెల్లుమనింపించాడు. అనంతరం వినాయక్ అంబేకర్ ఈ ఘటనపై పూనె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదే ఫిర్యాదులో తనను ఎన్సీపీ ఎంపీ గిరీష్ బాపట్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసినట్టు బీజేపీ నేత వినాయక్ అంబేకర్ ఆరోపించారు. మహారాష్ట్ర ప్రదేశ్ బీజేపీ ప్రతినిధి వినాయక్ అంబేకర్‌పై ఎన్సీపీ గుండాలు దాడి చేశారని పాటిల్ తన ట్విట్టర్ అకౌంట్‌లో మరాఠీలో ట్వీట్ చేశారు. బీజేపీ తరఫున తాను ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ ఎన్సీపీ గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

महाराष्ट्र प्रदेश भारतीय जनता पार्टीचे प्रवक्ते प्रा. विनायक आंबेकर यांच्या वर राष्ट्रवादीच्या गुंडांनी भ्याड हल्ला केला असून, भाजपाच्या वतीने मी या हल्ल्याचा तीव्र शब्दांत निषेध व्यक्त करतो. राष्ट्रवादीच्या या गुंडांवर तात्काळ कारवाई झालीच पाहिजे ! pic.twitter.com/qR7lNc1IEN

— Chandrakant Patil (@ChDadaPatil)

ఫేస్‌బుక్‌లో శరద్ పవార్‌పై అభ్యంతరక కామెంట్లు చేసినందుకు గాను శనివారం మరాఠీ యాక్టర్ కేటకి చితాలే, ఓ స్టూడెంట్ నికిల్ భమ్రేలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆ యాక్టర్‌ను మే 18వ తేదీ వరకు పోలసీు కస్టడీ కోసం రిమాండ్‌కు పంపారు.

ఆ పోస్టులో కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు ఉన్నాయి. నరకం నీ కోసం ఎదురుచూస్తున్నది.. బ్రాహ్మణులను నువ్వు ద్వేషిస్తావు వంటి లైన్‌లు ఆ పోస్టులో ఉన్నాయి. వీటిని శరద్ పవార్‌ను ఉద్దేశిస్తూ ఉన్నట్టు ఆరోణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో శరద్ పవార్‌పై పోస్టుల వ్యవహారమై మొత్తం ఐదు కేసులు నమోదు అయ్యాయి. 
 

click me!