ఫలితాలు ఊహించినట్లుగానే ఉన్నాయి: గుజరాత్ ఎన్నికల ఫలితాలపై శరద్ పవార్ కామెంట్స్

By Rajesh KarampooriFirst Published Dec 8, 2022, 8:34 PM IST
Highlights

గుజరాత్ ఎన్నికల ఫలితాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. రాష్ట్రంలో గెలుపొందేందుకు అధికార యంత్రాంగమంతా సిద్ధమైనందున గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే వచ్చాయన్నారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. గత ఎన్నికల్లో కంటే.. 57 సీట్లు అధికంగా గెలుచుకొని బంపర్ విక్టరీని కైవసం చేసుకుంది. మోడీ చరిష్మా ముందు ప్రతిపక్షాలు తేలిపోయాయి. దూకుడు వ్యవహరించిన ఆప్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. కేవలం 5 సీట్లకే పరిమితమైంది. అలాగే.. ప్రధాన పక్షంగా బరిలో దిగిన కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకు మాత్రమే కైవసం చేసుకుంది.  ఈ ఓటమిలో కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు కొన్నైతే..ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తప్పిదాలు కొన్ని..  

గుజరాత్ ఎన్నికల ఫలితాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఒక రాష్ట్రంలో గెలుపొందేందుకు అధికార యంత్రాంగమంతా సిద్ధమైనందున గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే వచ్చాయన్నారు. అలాగే.. గుజరాత్ ఎన్నికల్లో గెలవడానికి, బిజెపి రాష్ట్రంలో అత్యధిక ప్రాజెక్టులను బహుమతిగా ఇచ్చింది. ఇది అంచనాలకు సమానమైన ఫలితాలకు దారితీసిందని అన్నారు. బీజేపీకి విజయం అందించిన గుజరాత్ ప్రజలకు అభినందనలు తెలిపారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినట్లుగానే ఉన్నాయని, అయితే అవి దేశ మానసిక స్థితిని ప్రతిబింబించడం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం అన్నారు. దేశంలో భిన్నమైన వాతావరణం ఉందనీ, ఈ ఎన్నికలు భిన్నమైన దిశను చూపడం ప్రారంభించాయని ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్ అన్నారు. గుజరాత్ ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదని, అయితే గుజరాత్ ఫలితాలు దేశ వాతావరణాన్ని ప్రతిబింబించడం లేదని ఆయన అన్నారు.ఎంసిడి, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాల్లో  బిజెపి ఓడిపోయిందనీ, ఈ విషయాన్ని మరచిపోకూడదని ఆయన సూచించారు. ఒక రాష్ట్రం (గుజరాత్) సౌలభ్యం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారని, రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు మారాయని, దాని ఫలితమే బీజేపీ విజయం అని అన్నారు. 

ఈ ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అద్భుత విజయం సాధించిందనీ, అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించారని ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 'గుజరాత్ బీజేపీకి చెందిన ప్రతి కార్యకర్త ఛాంపియన్‌ అనీ, కార్యకర్తల శ్రమ లేకుండా ఈ  చారిత్రాత్మక విజయం సాధ్యం కాదని అన్నారు. కార్యకర్తలే బీజేపీకి నిజమైన బలమని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తాజా సమాచారం ప్రకారం.. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 156 స్థానాలు పొందగా.. కాంగ్రెస్  17స్థానాల్లో, ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించింది.   

click me!