దివంగత నేత డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ..!

Published : May 25, 2022, 06:19 PM IST
దివంగత నేత డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ..!

సారాంశం

దివంగత నేత డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడును ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో డీకే శ్రీనివాస్ నాయుడను ఎన్సీబీ అరెస్ట్ చేసినట్టు ఎన్టీవీ న్యూస్ చానల్ పేర్కొంది. 

దివంగత నేత డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్ నాయుడును ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో డీకే శ్రీనివాస్ నాయుడను ఎన్సీబీ అరెస్ట్ చేసినట్టు ఎన్టీవీ న్యూస్ చానల్ పేర్కొంది. శ్రీనివాస్ నాయుడు ఇంట్లో సోదాలు జరిపిన ఎన్‌సీబీ అధికారులు.. ఆయనను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఓ కన్నడ సినీ నటుడిని కూడా ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకన్నట్టుగా తెలుస్తోంది. ఇక, శ్రీనివాస్‌ ఇంట్లో భారీగా డ్రగ్స్ దొరికినట్టుగా సమాచారం. 

మరోవైపు శ్రీనివాస్‌తో పాటు మరికొందరి ఇళ్లలో కూడా ఎన్‌సీబీ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఆంధ్ర, కర్ణాటక నేతలకు శ్రీనివాస్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా ఎన్‌సీబీ అనుమానిస్తుంది. ఇక, తెలుగు, రాజకీయ సినీ ప్రముఖులతో శ్రీనివాస్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా సమాచారం. 

ఇక, శ్రీనివాస్‌ను ఎన్‌సీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్టుగా కన్నడ మీడియా పబ్లిక్ టీవీ పేర్కొంది. అనంతరం శ్రీనివాస్‌ను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. శ్రీనివాస్ నాయుడు ఓ అపార్ట్ మెంట్ లో పార్టీ చేసుకుంటుండగా పట్టుబడినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu