హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సైనీ.. 5 గంటలకు ప్రమాణ స్వీకారం..

By Sairam IndurFirst Published Mar 12, 2024, 3:37 PM IST
Highlights

హర్యానా సీఎంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నాయబ్ సైనీని అధిష్టానం ఎంపిక చేసింది. నేటి సాయంత్రం 5 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 

హర్యానాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. బీజేపీ సీనియర్ నాయకుడు, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ దత్తాత్రేయకు తన రాజీనామా సమర్పించారు. దీంతో కొత్త సీఎంగా బీజేపీ అధిష్టానం నయాబ్ సింగ్ సైనీగా ఎంపిక చేశారు. నేడే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు సైనీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సైనీ కురుక్షేత్ర నుంచి ఎంపీగా ఉన్నారు. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన గతేడాది అక్టోబర్ లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. కాగా.. 2019 నుండి రాష్ట్రాన్ని పాలిస్తున్న అధికార భారతీయ జనతా పార్టీ-జననాయక్ జనతా పార్టీ (బీజేపీ-జేజేపీ) కూటమిలో చీలికల మధ్య మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడంతో సైనీని బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. .

Haryana BJP president Nayab Singh Saini to be next CM of Haryana pic.twitter.com/6zbPGzFoGm

— ANI (@ANI)

లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకాల చర్చలు విఫలం కావడంతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఖట్టర్ మంత్రివర్గంలో సీఎం సహా 14 మంది మంత్రులు, ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీకి చెందిన ముగ్గురు సభ్యులు ఉన్నారు.90 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీకి 41 మంది, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడుగురు ఇండిపెండెంట్లలో ఆరుగు రి మద్దతు కూడా అధికార కూటమికి ఉంది.

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు 30 మంది ఎమ్మెల్యేలు, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, హర్యానా లోక్హిత్ పార్టీకి చెరో స్థానం ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 లోక్ సభ స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది.

click me!