Punjab Election result 2022: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో సిద్దూ ముందంజ

Published : Mar 10, 2022, 08:56 AM IST
Punjab Election result 2022:  పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో సిద్దూ ముందంజ

సారాంశం

 అమృత్ సర్ ఈస్ట్ లో  కాంగ్రెస్ అభ్యర్ధి సిద్దూ ముందంజో నిలిచారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో సిద్దూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

చంఢీఘడ్: పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ అమృత్ సర్ ఈస్ట్ అసెంబ్లీ స్థానంలో ముందంజలో ఉన్నారు.  Amritsar East స్థానం నుండి navjot singh sidhu పోటీ చేసిన విషయం తెలిసిందే.పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో సిద్దూ ముందంజలో కొనసాగుతున్నారు.

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమయింది.  పంజాబ్ విషయానికి వస్తే ఇక్కడ ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో మొత్తం 117 స్థానాలకు ఫపోలింగ్ జరిగింది. మొత్తం 2.14 కోట్ల ఓటర్లు ఉండగా.. 72 శాతం పోలింగ్ నమోదైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఇది 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన పోలింగ్ శాతంతో పోలిస్తే తక్కువగా ఉంది. పంజాబ్‌లో 2017లో 77.4 శాతం పోలింగ్ నమోదైంది.

పంజాబ్‌లో మొత్తం 117 శాసనసభ స్థానాలు ఉండగా.. ఎన్నికల బరిలో మొత్తం 1,304 అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో కేవలం 93 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. ఇక, పంజాబ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారన్ని నిలుపుకోవాలని చూస్తోంది. పంజాబ్‌లో వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎస్​ఏడీ బీజేపీ కూటమిని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓడించిం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ 77 సీట్లలో, ఆప్​ 20 చోట్ల గెలిచింది. ఎస్​ఏడీ–బీజేపీ కూటమి 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈసారి పంజాబ్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్.. పంజాబ్‌‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక, సాగు చట్టాల విషయంలో బీజేపీకి దూరం జరిగిన ఎస్‌ఏడీ.. ఈ ఎన్నికలల్లో బీఎస్పీతో జట్టు కట్టింది. ఇక, బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, బాదల్ నేతృ‌త్వం‌లోని ఎస్‌‌ఏడీ (సం‌యు‌క్త)తో కలిసి బరి‌లోకి దిగింది.

పంజాబ్ ఎన్నికల బరిలో..  ప్రస్తుతం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. చౌమ్‌కౌర్ సాహిబ్, Bhadaur రెండు స్థానాల నుంచి బరిలో ఉన్నారు. పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.. అమృత్‌సర్ ఈస్ట్, మాజీ సీఎం అమరీందర్ సింగ్.. పటియాలా, శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్, ఆప్​ సీఎం అభ్యర్థి Bhagwant Mann.. ధురి, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్.. లాంబి, పంజాబ్​ బీజేపీ చీఫ్​ అశ్వనీ శర్మ.. పఠాన్‌కోట్ స్థానాల నుంచి ఎన్నిక బరిలో నిలిచారు.
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu