నవీ ముంబైలోని పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఇంజనీర్ సహా ముగ్గురికి తీవ్ర గాయాలు

Published : Oct 09, 2022, 03:32 PM IST
నవీ ముంబైలోని పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఇంజనీర్ సహా ముగ్గురికి తీవ్ర గాయాలు

సారాంశం

మహారాష్ట్రలోని నవీ ముంబైలోని యురాన్ పవర్ ప్లాంట్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇంజనీర్, ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. పేలుడు తర్వాత గ్యాస్ లీకేజీ కూడా పెద్ద ఎత్తున జరిగింది.

నవీ ముంబై పవర్ ప్లాంట్ పేలుడు: మహారాష్ట్రలోని నవీ ముంబైలోని ఉరాన్‌లో ఉన్న పవర్ ప్లాంట్‌లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో  ఒక ఇంజనీర్‌, ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. వారందరినీ నవీ ముంబైలోని ఐరోలి ఆసుపత్రిలో చేర్చారు. పేలుడు తర్వాత గ్యాస్ లీకేజీ కూడా పెద్ద ఎత్తున జరిగింది. గ్యాస్ నియంత్రణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

గ్యాస్ ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ ఉరాన్ గ్యాస్ టర్బైన్ పవర్ స్టేషన్ (జీటీపీఎస్)లో ఆదివారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !