మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మోడీ ఘన స్వాగతం

By narsimha lodeFirst Published Oct 11, 2019, 5:23 PM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలోని షోర్ ఆలయం రెండు దేశాల కీలక నేతలకు అతిథ్యం ఇచ్చింది. 


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలోని షోర్ దేవాలయంలో చైనా అధ్యక్షుడు  జిన్‌పింగ్, భారత ప్రధాని మోడీ కలుసుకొన్నారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుక్రవారం నాడు  చెన్నై చేరుకొన్నారు. చెన్నై నుండి జిన్‌పింగ్ నేరుగా  మహాబలిపురం చేరుకొన్నారు. మహాబలిపురం ఆలయం వద్ద భారత ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కు ఘనంగా స్వాగతం పలికారు.

ఇండియా ప్రధాని మోడీ తమిళనాడు సంప్రదాయం ప్రకారంగా పంచె కట్టులో చైనా అధ్యక్షుడికి స్వాగతం పలికారు. షోర్ ఆలయంలో తిరుగుతూ ఆలయానికి సంబంధించిన చరిత్రను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీకి ఆయన వివరించారు.

ఈ ఆలయంలో అర్జున తపస్సు ప్రాంతం చరిత్రలో ప్రసిద్ది చెందింది. . ఈ ప్రాంతంలోనే వెయ్యేళ్ల క్రితమే ఓడరేవులు ఉన్నాయి. చైనా నుండి ఈ ప్రాంతం నుండి వాణిజ్య సంబంధాలు కొనసాగించినట్టుగా చెబుతారు.

click me!