లలిత జ్యూయలరీ కేసు: మురుగన్ లొంగుబాటు

Published : Oct 11, 2019, 03:58 PM ISTUpdated : Oct 11, 2019, 04:10 PM IST
లలిత జ్యూయలరీ కేసు: మురుగన్ లొంగుబాటు

సారాంశం

దేశ వ్యాప్తంగా సంచలనం సృస్టించిన లలిత జ్యూయలరీ చోరీ చిక్కుముడి వీడిపోయింది. ప్రధాన నిందితుడు మురుగన్ పోలీసులకు చిక్కాడు.

 లలిత జ్యూయలరీ దుకాణంలో  చోరీలో కీలక  నిందితుడు మురుగన్ శుక్రవారం నాడు బెంగుళూరు పోలీసుల ముందు  లొంగిపోయారు.

మురుగన్‌పై  100కు పైగా కేసులు ఉన్నాయి. ఈ నెల 2వ తేదీ రాత్రి లలిత జ్యూయలరీ దుకాణంలో  మురుగన్  గ్రూప్ బంగారు ఆభరణాలను దోచుకొన్నారు.

ఈ దుకాణం వెనుక వైపు గోడను తవ్వి దొంగలు లోపలికి వ్రవేశించారు. దుకాణంలో ఉన్న రూ. 13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన తర్వాత ఐదుగురు దొంగలను పోలీసులు పట్టుకొన్నారు.ఆ తర్వాత మరికొందరు పోలీసులకు లొంగిపోయారు. తమిళనాడులో కొందరు పోలీసులకు లొంగిపోయారు. శుక్రవారం నాడు మరో ముగ్గురు పోలీసులకు లొంగిపోయారు. 

ఈ వార్త చదవండి

లలిత జ్యువెలరీ చోరీ: ఆంధ్ర టీవీ నటితో మురుగన్ సినిమా ఇదే

 

ఈ చోరీ కేసులో ప్రధాన నిందితుడు మురుగన్  బెంగుళూరు పోలీసులకు లొంగిపోయారు. మురుగన్ లొంగిపోవడంతో ఈ కేసుకు సంబంధించిన ప్రధాన చిక్కుముడి వీడిపోయినట్టేనని పోలీసులు భావిస్తున్నారు. 

మురుగన్ పై పలు కేసులు ఉన్నాయి. జైలు నుండి బయటకు రాగానే మురుగన్  ఈ దోపిడికి పాల్పడ్డారు.చోరీ చేసిన సొమ్ముతో  సినిమా తీయాలనే మురుగన్ ప్లాన్ చేశాడు.

PREV
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు