అనారోగ్యంతో బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ మృతి

Published : Mar 02, 2021, 12:25 PM IST
అనారోగ్యంతో బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ మృతి

సారాంశం

బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ చౌహాన్ కరోనాతో మంగళవారం నాడు మరణించారు.గురుగ్రామ్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ చౌహాన్ కరోనాతో మంగళవారం నాడు మరణించారు.గురుగ్రామ్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కన్వాడ నియోజకవర్గం నుండి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. చౌహాన్ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరాడు.

చౌహాన్ కొంతకాలంగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసుపత్రికి వెళ్లి ఎంపీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. ఎంపీ మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.

1996 నుండి కాన్వాడ ఎంపీ స్థానం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2009 నుండి 2014 వరకు ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి అరుణ్ సుభాష్ చంద్రయాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు