Yogi Adityanath: రోడ్లపై నమాజ్ చేయ‌డం ఆగిపోయింది: సీఎం యోగి ఆదిత్యనాథ్

Published : May 23, 2022, 05:39 AM IST
Yogi Adityanath:  రోడ్లపై నమాజ్ చేయ‌డం ఆగిపోయింది: సీఎం యోగి ఆదిత్యనాథ్

సారాంశం

Yogi Adityanath: యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లపై నమాజ్ చేయ‌డం ఆగిపోయిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.రాష్ట్రంలోని అక్రమ కబేళాలను బీజేపీ ప్రభుత్వం మూసివేసిందని, రాష్ట్రంలో గోవులను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు గోశాలలను నిర్మించామని, మతపరమైన ప్రదేశాల నుంచి లౌడ్ స్పీకర్లను కూడా తొలగించామని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.  

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈద్ సందర్భంగా వీధుల్లో ప్రార్థనలు చేయడం ఆగిపోయిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ముఖ్యమంత్రి ఎత్తిచూపారు. రామ నవమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో మత ఘర్షణలు జరగలేదని అన్నారు. యూపీలో ఈసారి రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.. కానీ రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదని అన్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా ఈద్‌కు నమాజ్, జుమా ల‌ను రహదారిపై నిర్వహించబడలేద‌ని అన్నారు .
 
గత ఐదేళ్లలో ఒక్క అల్లర్లు కూడా జరగలేదు

గత ఐదేళ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుప‌డ్డాయని అన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ( 2017 నుంచి ) రాష్ట్రంలో ఒక్క అల్లర్లు కూడా జరగలేదని  సీఎం యోగి అన్నారు.

అక్రమ కబేళాలను మూసివేత‌.. 
 
రాష్ట్రంలో అక్రమ కబేళాలను మూసివేశామ‌ని, రాష్ట్రంలో గోవులను సురక్షితంగా,  ఆరోగ్యంగా ఉంచడానికి  గోశాలలను నిర్మించామ‌ని తెలిపారు. అలాగే మతపరమైన ప్రదేశాల నుండి లౌడ్ స్పీకర్లను కూడా తొలగించామని, అలాగే బీజేపీ ప్రభుత్వం హ‌యంలో 700 పైగా మతపరమైన స్థలాలను నిర్మించామ‌ని, ప‌లు దేవాల‌యాల‌ను పునర్నిర్మించమ‌ని తెలిపారు. 

గతంలో ముజఫర్‌నగర్‌, మీరట్‌, మొరాదాబాద్‌ తదితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగేవని.. నెలల తరబడి కర్ఫ్యూలు ఉండేవని.. అయితే గత ఐదేళ్లలో ఒక్క అల్లర్లు కూడా జరగలేదన్నారు. గతంలో రోడ్లపైన, పొలాల్లో సంచరించే పశువులను అక్రమ కబేళాలకు తరలించేవారని, వీటిని అరికట్టేందుకు 5,600కి పైగా  పశువుల ఆశ్రయాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu