ఆ రైల్వేస్టేషన్ పేరు మార్చనున్న మహారాష్ట్ర సర్కార్..

Published : Jun 30, 2023, 01:49 AM IST
ఆ రైల్వేస్టేషన్ పేరు మార్చనున్న మహారాష్ట్ర సర్కార్..

సారాంశం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లా ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరును 'నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ' రైల్వే స్టేషన్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బాటలో ప్రయాణిస్తున్నారు. సీఎం యోగి లాగానే.. షిండే కూడా నగరాలు, వంతెనల పేర్లు మార్చేందుకు పనిలో పడ్డారు. ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్ పలు నగరాల, వంతెనల పేరు మార్చింది. తాజాగా.. ఓ రైల్వేస్టేషన్ పేరును మార్చుతున్నట్టు షిండే సర్కార్ కీలక ప్రకటన చేసింది.  నాగ్ పూర్ జిల్లాలోని ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరును 'నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ' స్టేషన్ గా మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే  కృష్ణ ఖోప్డే  సమాచారం ఇచ్చారు. 

బిజెపి ఎమ్మెల్యే  కృష్ణ ఖోప్డే మీడియాతో మాట్లాడుతూ.. నాగ్ పూర్ జిల్లాలోని ఇత్వారీ రైల్వే స్టేషన్ పేరును 'నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇత్వారీ' స్టేషన్ గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనీ, ఇందుకు సంబంధించి మే 23న హోం మంత్రిత్వ శాఖ నుంచి పేరు మార్పునకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందించిందనీ, అలాగే.. జూన్ 16న రాష్ట్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని నాగ్‌పూర్ తూర్పు ఎమ్మెల్యే కృష్ణ ఖోప్డే తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులు అర్పించడంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.

మహారాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఔరంగాబాద్ పేరును ‘ఛత్రపతి శంభాజీ నగర్’గా, ఉస్మానాబాద్ నగరానికి ‘ధరాశివ్’గా , అహ్మద్‌నగర్ ను అహల్యాదేవి హోల్కర్‌గా పేరు మార్చిన విషయం తెలిసిందే. అలాగే.. ఇటీవల వెర్సోవాబాంద్రా సీలింక్ కు వీడీ సావర్కర్ సేతుగా నామకరణం చేసింది. అలాగే ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్‌కు మాజీ ప్రధాని వాజ్‌పాయ్ స్మృతి నవసేన అటల్ సేతు అని పేరు ఖరారు చేసింది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌