భర్త, పిల్లలకు విషం ఇంజెక్షన్ ఇచ్చిన మహిళా డాక్టర్

Published : Aug 19, 2020, 11:40 AM ISTUpdated : Aug 19, 2020, 11:54 AM IST
భర్త, పిల్లలకు విషం ఇంజెక్షన్ ఇచ్చిన మహిళా డాక్టర్

సారాంశం

 డాక్టర్ సుష్మా మరో గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలంలో రెండు సిరంజీలు, సూసైడ్ నోట్ లభించాయి. 

ఓ మహిళా డాక్టర్.. తాను కట్టుకున్న భర్తను.. కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను అతి కిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగపూర్ నగరానికి చెందిన డాక్టర్ సుష్మారాణే (41) తన భర్త అయిన ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ ధీరజ్ (42),ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. డాక్టర్ సుష్మా తన భర్త, ఇద్దరు పిల్లలకు మత్తు మందు కలిపిన ఆహారం పెట్టి వారు స్పృహ తప్పగానే వారికి విషపు ఇంజక్షన్ ఇచ్చి హతమార్చారు.

అనంతరం డాక్టర్ సుష్మా మరో గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలంలో రెండు సిరంజీలు, సూసైడ్ నోట్ లభించాయి. డాక్టర్ జీవితంలో నిరాశతోనే ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసులు నాలుగు మృతదేహాలను పోస్టుమార్టంకోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం