నా భార్య అసలు ఆడదే కాదు... నాలాగే ఓ పురుషుడు : ఆరేళ్ళ కాపురం తర్వాత బయటపెట్టిన భర్త

Published : Oct 02, 2022, 08:47 AM IST
నా భార్య అసలు ఆడదే కాదు... నాలాగే ఓ పురుషుడు : ఆరేళ్ళ కాపురం తర్వాత బయటపెట్టిన భర్త

సారాంశం

ఆరేళ్ళ కాపురం తర్వాత భార్య ఆడదేకాదంటూ ఓ భర్త బయటపెట్టడమే కాదు వివాహాన్ని రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన వింత ఘటన మధ్య ప్రదేశ్ లో వెలుగుచూసింది. 

గ్వాలియర్ : తన భార్య మహిళ కాదు పురుషుడంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగుచూసింది. ఆరేళ్ల కాపురం తర్వాత అతడిలా తన భార్య ఆడదే కాదంటూ అనుమానం వ్యక్తం చేయగా... అతడి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పెళ్లిని రద్దు చేసింది. 

ఈ వింత వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ కు చెందిన యువకుడితో ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. అయితే పెళ్లయి ఇన్నేళ్లు గడుస్తున్నా ఇద్దరూ శారీరకంగా ఒక్కటవ్వలేదు. ఇందుకు భార్య వింత శరీరాకృతేనని సదరు భర్త ఇప్పుడు బయటపెట్టాడు.  

తన భార్య చూడ్డానికి అమ్మాయిలా వుంది... కానీ ఆమె ఆడది కాదు పురుషుడంటూ భర్త బాంబ్ పేల్చాడు. ఈ విషయాన్ని దాచిపెట్టి ఆమెను తనకిచ్చి పెళ్లి చేసారంటూ అత్తింటివారిపైనా అతడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. భార్యతో పాటు ఆమె తండ్రిపై కేసు నమోదు చేయాలని అతడు పోలీసులను కోరాడు. 

Read More నీ ఓవ‌ర్ యాక్ష‌న్ త‌గ‌లేయ్యా.. పాముకు కిస్ ఇవ్వ‌డానికి య‌త్నం .. దెబ్బ‌కు సీన్ రివ‌ర్స్

అయితే భార్య ఆడదికాదంటూ అతడు ఫిర్యాదు చేయడంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులు చర్యలు తీసుకోలేదు. దీంతో సదరు వ్యక్త న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో అతడి భార్యకు వైద్య పరీక్షల నిర్వహించగా నిజంగానే పురుషుడని తేలింది. దీంతో వీరి వివాహాన్ని ఫ్యామిలీ కోర్టు రద్దు చేసింది. 

హార్మోన్ల సమస్య వల్ల మహిళ పూర్తిగా పురుషుడిలా మారింది. ఈ సమస్య గురించి భర్తకు చెప్పలేకపోయానని... అంతేగాని ఆయనను మోసం చేయాలని కాదని ఆమె తెలిపింది. ఈ సమస్యకు చికిత్స చేయించుకుంటున్నానని... పూర్తిగా అమ్మాయిలా మారడానికి ప్రయత్నిస్తున్నానని మహిళ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?