ప్రియుడితో గోవా ట్రిప్.. ఇంట్లో తెలీకుండా దాచబోయి.. కటకటాల్లోకి...

Published : Feb 23, 2021, 10:21 AM IST
ప్రియుడితో గోవా ట్రిప్.. ఇంట్లో తెలీకుండా దాచబోయి.. కటకటాల్లోకి...

సారాంశం

తన విహార యాత్రల గురించి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఉంచాలని ప్రయత్నించిన ఓ యువతి చివరికి కటకటాల పాలయ్యింది. ముంబైలో జరిగిన ఈ ఘటనలో సరదాగా చేసిన ఆ పని ఆ యువతిని చిక్కుల్లో పడేసింది. 

తన విహార యాత్రల గురించి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఉంచాలని ప్రయత్నించిన ఓ యువతి చివరికి కటకటాల పాలయ్యింది. ముంబైలో జరిగిన ఈ ఘటనలో సరదాగా చేసిన ఆ పని ఆ యువతిని చిక్కుల్లో పడేసింది. 

వివరాల్లోకి వెడితే...ముంబైకి చెందిన అంబర్ సయ్యద్ అనే యువతి(28) మూడేళ్లుగా దుబాయ్ లో ఉద్యోగం చేస్తోంది. అయితే.. ఈ ఏడాది జనవరి 19న సెలవులపై ఆమె ముంబైకి వచ్చింది. ఫిబ్రవరి 19న దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకుంది. 

అయితే ఎయిర్ పోర్టులో తనిఖీల టైంలో అక్కడి అధికారులు ఆమె పాస్‌పోర్టులో తప్పుడు వివరాలు నమోదైనట్టు గుర్తించారు. గతేడాది మార్చి 14న ఆమె దుబాయ్ నుండి భారత్ కు వచ్చినట్టు రికార్డుల్లో నమోదయ్యింది. అయితే సదరు యువతి పాస్ పోర్టులో మాత్రం మార్చి 20న వచ్చినట్టు రాసుంది.

దీంతో అనుమానం వచ్చిన అధికారులు  అప్రమత్తమయ్యారు. యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు యువతి పొంతన లేని సమాధానాలు చెబుతూ మొదట్లో తప్పించుకునే ప్రయత్నం చేసింది. 

ఆ తరువాత నిజం అంగీకరించింది. అయితే ఆ టైంలో తాను మార్చి 14నే ఇండియాకు వచ్చినా స్నేహితుడితో కలిసి గోవా వెళ్లానని.. ఈ విషయం ఇంట్లో తెలిస్తే గొడవవుతుందని.. ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యుల నుంచి దాచిపెట్టేందుకు ప్రయత్నించానని చెప్పింది. 

దీనికోసం నకిలీ రబ్బర్ స్టాంప్‌తో పాస్‌పోర్టులో వివరాలు మార్చినట్టు ఒప్పుకుంది. అంతేతప్పా దీనికి వేరే కారణమేదీ లేదంటూ బోరన విలపించింది. దీంతో పోలీసులు యువతిపై ఫోర్జరీ, చీటింగ్ కేసులను నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం న్యాయస్థానం ఆమెకు ఫిబ్రవరి 22 వరకూ రిమాండ్ విధించింది. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu