కొడుకు ప్రేమ పెళ్లి.. కోడలిపై అనుమానంతో..

Published : Dec 31, 2020, 08:19 AM ISTUpdated : Dec 31, 2020, 08:30 AM IST
కొడుకు ప్రేమ పెళ్లి.. కోడలిపై అనుమానంతో..

సారాంశం

అయితే పంకజ్‌ వాళ్ల తండ్రి కమల్‌ రాజ్‌కు కొడుకు నందినినని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.

కొడుకు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి తండ్రికి నచ్చలేదు. కొడుకు, కోడలిని ఎలాగైనా విడదీయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో.. కొడుకు లేని సమయం చూసుకొని కోడలిని హతమార్చేశాడు. అనంతరం శవాన్ని మూటగట్టి పడేశాడు. ఇటీవల ముంబయి బీచ్ లో ఓ మహిళ శవం దొరికింది కదా.. అది ఈ ఘటనకు సంబంధించినదే కావడం గమనార్హం. 

పూర్తి వివరాల్లోకి వెళితే... ఈస్ట్‌ కాందివ్లీకి చెందిన పంకజ్‌ని మూడు సంవత్సరాల క్రితం నందిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పంకజ్‌ వాళ్ల తండ్రి కమల్‌ రాజ్‌కు కొడుకు నందినినని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అంతేగాక ఆమె క్యారెక్టర్‌పై అనుమానం పెంచుకున్నాడు. 
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పని నిమిత్తం పంకజ్‌ వేరే ఊరికి వెళ్లాడు. 

ఇదే అదునుగా భావించిన మామ కమల్‌ రాజ్‌ కోడలిని ఎలా అయినా అంతమొందించాలని పన్నాగం పన్నాడు. దీంతో డిసెంబర్‌ 9న కమల్‌.. ఇద్దరు స్నేహితులతో కలసి నందిని నిద్రిస్తున్న సమయంలో ఆమె చేతులు కాళ్లు కట్టేసి దిండుతో నొక్కి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ప్యాక్‌ చేసి దానిని కండివిల్లి ప్రాంతంలోని నాలాలో విసిరేశారు. 

డిసెంబర్‌ 24న మృతదేహం కలిగిన గోనె సంచి ఆక్షా బీచ్‌కు చేరుకుంది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దానిని తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసులో మామతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir : అయోధ్యలో ఆలయాన్నయితే కట్టేశాం, కానీ అసలు పని ఇప్పుడే మొదలైంది: ప్రాజెక్ట్ చీఫ్ నృపేంద్ర మిశ్రా
జూలై 1 నుంచి రైల్వే కొత్త రూల్స్... | Indian Railways New Rules from July 1 | Asianet News Telugu