ఆన్ లైన్ మోసాల పై పోలీసుల వీడియో.. నెటిజన్ల ప్రశంసలు..!

By telugu news teamFirst Published Dec 1, 2022, 9:37 AM IST
Highlights

యువతను  ఆకర్షించడంలో ముంబయి పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా.. ఆన్‌లైన్ మోసాల గురించి సందేశాన్ని అందించడానికి వారు ఆసక్తికరమైన మార్గాన్ని కనుగొన్నారు. 

ప్రజలకు సమాచారం అందించడంలో పోలీసులు ముందుంటారు. వారికి రక్షణ కల్పించడంతో పాటు.. వారు  ఏ విధంగా నష్టపోకుండా ఉండేందుకు సోషల్ మీడియా వేదికగా సమాచారాన్ని చేరవేస్తూ ఉంటారు. తాజాగా... ముంబయి పోలీసులు ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేశారు. సోషల్ మీడియా వేదికగా.. వీడియో రూపంలో ఆన్ లైన్ మోసాల గురించి సందేశాన్ని తెలియజేశారు.

యువతను  ఆకర్షించడంలో ముంబయి పోలీసులు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా.. ఆన్‌లైన్ మోసాల గురించి సందేశాన్ని అందించడానికి వారు ఆసక్తికరమైన మార్గాన్ని కనుగొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో  పోలీసు డిపార్ట్‌మెంట్ జనాదరణ పొందిన ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్‌ను ప్రారంభించింది. స్కామర్ల గురించి ప్రజలను హెచ్చరించింది.
వీడియోతో పాటు, "ఇది ఆలోచించాల్సిన 'డైలమా' కాదు! మా పోలీసు సిబ్బంది దేనినీ ఆమోదించరు. మీ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి" అని క్యాప్షన్ లో పేర్కొన్నారు.

 

13 గంటల క్రితం షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కనిపిస్తున్నారు. వాటిలో ఒకదానిపై ఉన్న టెక్స్ట్ ఇలా ఉంది, "స్కామర్‌లు మిమ్మల్ని OTP కోసం అడుగుతున్నారు. మరొక వ్యక్తిపై, "మీరు స్కామర్‌లకు మీ OTPని ఇస్తున్నారు" అని రాసి ఉంది. అలా చేయకూడదు అని చెబుతూ ఈ వీడియో షేర్ చేయడం విశేషం.

కాగా... తెలియని వారికి సమాచారం తెలియజేసేలా ఉన్న ఈ వీడియోని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ విషయం తెలియక చాలా మంది ఇప్పటి వరకు... చాలా డబ్బు పోగొట్టుకోవడం గమనార్హం. అందుకే... ప్రజలను చైతన్య పరిచే విధంగా ఉన్న ఈ వీడియోని, పోలీసుల ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
 

click me!