
ముంబై: ముంబైలోని ఈఎస్ఐసీకామ్‌నగర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదంతో ఇద్దరు మృతి చెందారు. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.
ముంబైలోని అంథేరీ ప్రాంతంలోని ఈఎస్ఐసీ కామ్‌నగర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అగ్నిప్రమాదంతో ఒకరు మృతి చెందారు. మరో 28 మంది గాయపడ్డారు. ఆసుపత్రిలో మంటలను ఆర్పేందుకు అధికారులు వెంటనే ఫైరింజన్లను రప్పించారు. సుమారు 10 ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 47 మందిని రక్షించారు.