రూమ్మేట్ ని చంపి, పూడ్చిపెట్టి.. గదిక్లీన్ చేసి.. ప్రశాంతంగా పడుకున్నాడు..

Published : Aug 09, 2021, 09:51 AM IST
రూమ్మేట్ ని చంపి, పూడ్చిపెట్టి.. గదిక్లీన్ చేసి.. ప్రశాంతంగా పడుకున్నాడు..

సారాంశం

నాగ్ పూర్ లోని దాభా ప్రాంతంలోని ఓ గ్యారేజీలో రాజు నందేశ్వర్ (35), దేవాన్ష్ వఘోడే (26) ఇద్దరూ స్నేహితులు, ఒకే దగ్గర పని, ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. కలిసి మెలిసి ఉంటున్న వీరి మధ్య స్వల్ప విషయంలో వివాదం మొదలయ్యింది. ఈ ఘర్షణ మరింత ముదిరి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. 

క్షణికావేశంలో రూంమేట్ ను దారుణంగా హత్యచేసి, గుట్టు చప్పుడు కాకుండా పూడ్చి పెట్టిన వైనం స్నేహం అన్న పదానికే కళంకాన్ని ఆపాదించింది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ లోని ధాబా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ దారుణంలో చోటు చేసుకుంది. 

నాగ్ పూర్ లోని దాభా ప్రాంతంలోని ఓ గ్యారేజీలో రాజు నందేశ్వర్ (35), దేవాన్ష్ వఘోడే (26) ఇద్దరూ స్నేహితులు, ఒకే దగ్గర పని, ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. కలిసి మెలిసి ఉంటున్న వీరి మధ్య స్వల్ప విషయంలో వివాదం మొదలయ్యింది. ఈ ఘర్షణ మరింత ముదిరి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. 

దీంతో స్నేహితుడు నందేశ్వర్ ను తలపై గట్టిగా కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కానీ ఏ మాత్రం పశ్చాత్తాపం లేని అతగాడు మృతదేహాన్ని గదికి సమీపంలోని ప్రదేశంలో పూడ్చిపెట్టిన దేవాన్ష్ వాఘోడే ఏమీ తెలియనట్లు రూమ్ లో ప్రశాంతంగా పడుకున్నాడు.

అనుమానం వచ్చిన స్థానికులు ఆదివారం ఉదయం సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదుచేసిన పోలీసులు తమదైన శైలిలో దేవాన్ష్ న విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
 
PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu