పాఠ‌శాల‌లో విషాదం.. లిప్ట్ లో ఇరుక్కుని.. ప్రాణాలు కోల్పోయిన ఉపాధ్యాయురాలు..  ఎక్క‌డంటే..?

By Rajesh KarampooriFirst Published Sep 18, 2022, 1:44 AM IST
Highlights

ముంబైలోని ఓ పాఠ‌శాల‌లో విషాదం చోటు చేసుకుంది. ఉత్తర ముంబైలోని శివారు ప్రాంతమైన మలాడ్‌లోని చించోలి బందర్‌లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కుని 26 ఏళ్ల టీచర్ మృతి చెందింది. 

ముంబయిలోని ఓ స్కూల్లో షాకింగ్ చోటుచేసుకుంది. లిఫ్ట్ లో ఇరుక్కుని ఉపాధ్యాయురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న ఉత్తర ముంబైలోని శివారు ప్రాంతమైన మలాడ్‌లోని చించోలి బందర్‌లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్‌లో చోటు చేసుకుంది. 
 
అసలు ఏం జరిగింది? 

జానెలీ ఫెర్నాండెజ్ (26) అనే యువ‌తి చించోలి బందర్‌లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్‌లో
ఉపాధ్యాయురాలుగా ప‌ని చేస్తుంది. ఆమె ప్ర‌తి రోజులాగానే..  త‌న క్లాస్ ముగించుకుని.. రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్‌కి రావడానికి ఆరో అంతస్తు నుండి బయలుదేరింది. మధ్యాహ్నం ఒంటిగంట అయింది. ఆమె లిఫ్ట్ దగ్గరకు వెళ్లింది. లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే జానెల్ ఫెర్నాండెజ్ లిఫ్ట్‌లోకి ప్రవేశించింది. ఆమె ఒక కాలు పెట్టిన వెంటనే లిఫ్ట్ అకస్మాత్తుగా పైకి కదిలింది. దీంతో ఆ టీచ‌ర్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. 

ఆమె కేకలు వేయగా.. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు వ‌చ్చి.. హెల్ప్ చేయడానికి వచ్చారు. ఆమె ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా ర‌క్త స్ర‌ ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ,  అప్పటికే ఆ టీచ‌ర్  మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.

ప్రాథమిక విచారణలో ఉపాధ్యాయురాలు ప్రమాదవశాత్తు మరణించినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మలాడ్ పోలీసులు ఇప్పుడు ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ చెడిపోయిందా? మహిళ మృతికి లిఫ్ట్ మెయింటెనెన్స్ లేదా నిర్లక్ష్యం కారణమా అనే కోణంలో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయుల వాంగ్మూలాలను కూడా తీసుకున్నామ‌ని డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ ఠాకూర్ చెప్పారు.
 
 

click me!