భర్త మూడో భార్యను చంపిన రెండో భార్య

Published : Mar 07, 2019, 11:09 AM IST
భర్త మూడో భార్యను చంపిన రెండో భార్య

సారాంశం

తనను పట్టించుకోకుండా మూడో భార్యతోనే ఉంటున్నాడనే కోపంతో ఓ భార్య  తన సవతి పిల్లలతో కలిసి మూడో భార్యను  హత్య చేసింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.


ముంబై: తనను పట్టించుకోకుండా మూడో భార్యతోనే ఉంటున్నాడనే కోపంతో ఓ భార్య  తన సవతి పిల్లలతో కలిసి మూడో భార్యను  హత్య చేసింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.

ముంబైలోని నలసోపర ప్రాంతంలో 32 ఏళ్ల  వివాహిత మృతదేహం ఈ ఏడాది మార్చి 1వ తేదీన పోలీసులకు లభ్యమైంది. మృతురాలిని  యోగితా దేవ్రేగా పోలీసులు గుర్తించారు. సుశీల్ మిశ్రా అనే వ్యక్తి కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తుండేవాడు.  సుశీల్ మొదటి భార్య ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని నివాసం ఉండేది.

అయితే సుశీల్ మిశ్రా పార్వతి మానే యువతిని రెండో వివాహం చేసుకొన్నాడు.పార్వతి మానే  ముంబైలోని డాన్  సందులో  నివాసం ఉండేది. పార్వతి మానే వద్దే  సుశీల్ మిశ్రాకు మొదటి భార్య పిల్లలు కూడ ఆమెతోనే నివాసం ఉండేవారు.

 ఏడాది క్రితం సుశీల్ మిశ్రా యోగితా దేవ్రీని మూడో వివాహం చేసుకొన్నాడు.   మూడో పెళ్లి చేసుకొన్న తర్వాత యోగితా దేవ్రీ వద్దే సుశీల్ నివాసం ఉంటున్నాడు.

దీంతో పార్వతి మానేకు జీవనం ఇబ్బందిగా మారింది తమకు కనీసం తిండికి కూడ  డబ్బులను సుశీల్ సమకూర్చడం లేదు. దీనికి  యోగితా దేవ్రీ కారణంగా పార్వతి మానే భావించారు. అంతేకాదు యోగితా ముందు తనను  సుశీల్  అవమానించడాన్ని కూడ పార్వతి సీరియస్ గా తీసుకొంది.యోగితాను చంపితే సుశీల్ తిరిగి తమ వద్దకు వస్తాడని పార్వతి భావించింది.

మార్చి 1వ తేదీన యోగితాను చంపేందుకుపార్వతి ప్లాన్ చేసింది. తన సవతి పిల్లల సహాయం తీసుకొంది.  తన సవతి పిల్లలైన ఓ యువతి బాయ్‌ఫ్రెండ్ శైలేష్ కాలే ఈ విషయంలో పార్వతికి సహాయం చేశాడు.

మార్చి 1వ తేదీన సుశీల్ మరో ఊళ్లో పెళ్లికి వెళ్లిన సమయాన్ని గుర్తించిన పార్వతి తన సవతి పిల్లలను తీసుకొని  యోగితా ఉన్న ఇంట్లోకి డూప్లికేట్ తాళం చెవితో ప్రవేశించింది.
 

PREV
click me!

Recommended Stories

Space War: పాకిస్థాన్ మరో కుట్ర.. 16 నెలల్లో 6 శాటిలైట్లు.. భారత్‌పై చైనా సాయంతో నిఘా !
ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఇకలేరు | Indian Cinema Legend Bharathiraja Passes Away| Asianet Telugu