ఎమ్మార్పీ కంటే ఐస్‌క్రీమ్‌కి అదనంగా రూ. 10 వసూలు: రూ. 2 లక్షల ఫైన్ విధించిన కోర్టు

By narsimha lodeFirst Published Aug 27, 2020, 4:00 PM IST
Highlights

ఐస్‌క్రీమ్ పై ఎమ్మార్పీ కంటే అదనంగా రూ. 10 వసూలు చేసిన పాపానికి ఓ రెస్టారెంట్ ఏకంగా రూ. 2 లక్షలు జరిమానాను విధించింది వినియోగదారుల కోర్టు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.

ముంబై: ఐస్‌క్రీమ్ పై ఎమ్మార్పీ కంటే అదనంగా రూ. 10 వసూలు చేసిన పాపానికి ఓ రెస్టారెంట్ ఏకంగా రూ. 2 లక్షలు జరిమానాను విధించింది వినియోగదారుల కోర్టు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.

ముంబైలోని డీబీమార్గ్ పోలీస్ స్టేషన్ లలో 2014లో భాస్కర్ జాదవ్ పనిచేసేవాడు. 2014 జూన్ 8వ తేదీన షాగుణ్ రెస్టారెంట్ కు వెళ్లి ఫ్యామిలీ ప్యాక్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశాడు. ఐస్‌క్రీమ్ పై  ఎమ్మార్పీ కంటే రూ.10 వసూలు చేశారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఈ విషయాన్ని ఎస్ఐ ప్రశ్నిస్తే కూలీంగ్ ఛార్జీ అంటూ సమాధానం చెప్పారు.

ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ  రేటను వసూలు చేసిన  రెస్టారెంట్ పై ఎస్ఐ భాస్కర్ జాదవ్  వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు.  ఈ కేసు విచారణ 2015లో ప్రారంభించింది కోర్టు.  రెండు రోజుల క్రితం వినియోగదారుల ఫోరం రెస్టారెంట్ పై సంచలన తీర్పును వెల్లడించింది.  ఐస్ క్రీమ్ కొనుగోలు చేసిన వినియోగదారుడి  నుండి రూ. 10 వసూలు చేసిన రెస్టారెంట్ కు రూ. 2 లక్షలు జరిమానాను విధించింది.

24 ఏళ్లుగా రెస్టారెంట్ రోజూ రూ. 40 వేలకు పైగా అధిక ఆదాయాన్ని పొందిందని కోర్టు అభిప్రాయపడింది. అసలు ధర కంటే ఎక్కువ వసూలు చేసి లాభాలు గడించిన రెస్టారెంట్ జరిమానాను చెల్లించాలని తేల్చి చెప్పింది. అంతేకాదు అదనంగా రూ. 2 లక్షలను చెల్లించాలని కూడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

click me!