చిన్నారిపై వృద్ద జంట లైంగిక దాడి: 10 ఏళ్ల జైలు శిక్ష

Published : Mar 12, 2021, 03:56 PM IST
చిన్నారిపై వృద్ద జంట లైంగిక దాడి: 10 ఏళ్ల జైలు శిక్ష

సారాంశం

చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ద దంపతులకు ముంబైకోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు ఒక్కొక్కరికి రూ. 50 వేల జరిమానాను విధించింది.  

ముంబై: చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ద దంపతులకు ముంబైకోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు ఒక్కొక్కరికి రూ. 50 వేల జరిమానాను విధించింది.

ముంబైలోని గిర్గాన్‌ ప్రాంతంలో నివసించే భార్యభర్తలు తమ అపార్టుమెంటులో నివసించే నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. సెప్టెంబరు 4, 2013న ఈ అమానుష ఘటనకు ఒడిగట్టారు.పక్కింట్లో ఉన్న తన స్నేహితురాలితో ఆడుకునేందుకు చిన్నారి బయటకు రాగా ఆమెను తన ఇంట్లోకి తీసుకువెళ్లిన నిందితుడు(87) ఊయలలో కూర్చోబెట్టి కాసేపు ఆడించాడు.

 ఆ తర్వాత తన భార్య(80)ను పిలిచి, ఇద్దరూ కలిసి చిన్నారి దుస్తులు విప్పి వికృత చేష్టలకు పాల్పడ్డారు. చిన్నారి ఏడుస్తూ వారిని విడిపించుకునేందుకు ప్రయత్నించగా, చెంపలపై కొడుతూ దారుణంగా వ్యవహరించారు.

ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. అయితే రాత్రి నిద్రపోయే సమయంలో చిన్నారి వింతగా ప్రవర్తించడంతో ఆమె తల్లి పరీక్షించి చూసింది., చిన్నారి శరీర భాగాల్లో గాయాలు కనిపించాయి. దీంతో తన భర్తకు విషయం చెప్పింది. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 దాదా, దాదీ అంటూ పిలిచే ఆ పసిపాపపై వృద్ధ జంటే అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లితో పాటు మరికొంత మంది సాక్షులను విచారించింది కోర్టు.  

నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం నాడు కోర్టు తీర్పు ను ఇచ్చింది.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !