తాత అయిన ముఖేష్ అంబానీ.. వారసుడొచ్చాడు...

Bukka Sumabala   | Asianet News
Published : Dec 10, 2020, 03:19 PM IST
తాత అయిన ముఖేష్ అంబానీ.. వారసుడొచ్చాడు...

సారాంశం

ముకేష్ అంబానీ కొడుకు ఆకాష్, కోడలు శుక్లాలకు గురువారం మగబిడ్డ పుట్టాడు. దీంతో అంబానీల కుటుంబంలోకి నూతన వారసుడు వచ్చాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తొలిసారి తాత హోదాను సంపాదించారు. 

ముకేష్ అంబానీ కొడుకు ఆకాష్, కోడలు శుక్లాలకు గురువారం మగబిడ్డ పుట్టాడు. దీంతో అంబానీల కుటుంబంలోకి నూతన వారసుడు వచ్చాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తొలిసారి తాత హోదాను సంపాదించారు. 

దీంతో తల్లిదండ్రులతోపాటు అంబానీలు, మెహతాల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అంబానీ కుటుంబం నుంచి గురువారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది. 

‘‘శ్రీకృష్ణుని దయ, ఆశీర్వాదాలతో శ్లోక, ఆకాశ్ అంబానీ దంపతులు నేడు (గురువారం) ముంబైలో ఓ మగ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. ముఖేశ్ అంబానీ,  నీతా దంపతులు మొదటిసారి తాత, నాన్నమ్మ అయినందుకు చాలా సంతోషిస్తున్నారు. ధీరూభాయ్, కోకిలాబెన్ దంపతుల మునిమనుమడిని స్వాగతిస్తూ నీతా, ముఖేశ్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు’’ అని అంబానీ ఫ్యామిలీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 

శ్లోకతోపాటు మగ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపింది. మగ బిడ్డ జన్మించడంతో మెహతా, అంబానీ కుటుంబాలు చాలా సంతోషిస్తున్నట్లు తెలిపింది. శ్లోక మెహతా, ఆకాశ్ అంబానీల వివాహం గత ఏడాది మార్చిలో ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !