మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల కౌంటింగ్‌ : 9 స్థానాల్లో బీజేపీ, 2 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

By AN TeluguFirst Published Nov 10, 2020, 9:58 AM IST
Highlights

మధ్యప్రదేశ్‌ లో ఈ నెల మూడున జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ ఈ రోజు జరుగుతుంది. ఈ కౌంటింగ్ లో ఇప్పటికే బీజేపీ 9 స్థానాలోల​ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్‌ రెండు చోట ఆధిక్యంలో ఉంది.

మధ్యప్రదేశ్‌ లో ఈ నెల మూడున జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ ఈ రోజు జరుగుతుంది. ఈ కౌంటింగ్ లో ఇప్పటికే బీజేపీ 9 స్థానాలోల​ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్‌ రెండు చోట ఆధిక్యంలో ఉంది.

మధ్యప్రదేశ్‌లోనూ 28 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఏడు నెలల క్రితం జ్యోతిరాదిత్య సింధియా.. కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి.. తన వర్గంతో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్‌ శాసనసభలో ప్రస్తుతం బీజేపీ తరపున 107, కాంగ్రెస్‌ పార్టీ తరపున 87మంది ఎమ్మెల్యేలున్నారు. 

మ్యాజిక్‌‌ ఫిగర్‌ చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని బీజేపీ మరో 8 సీట్లు గెలుచుకోవాలి. ఒకవేళ 28 స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్‌ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశముంటుంది. వీటిలో 27 చోట్ల ఇదివరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ వర్గానికి అనుకూలంగా రానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

click me!