అమ్మ పని పోయింది.. చెల్లెళ్లు చదువుకోవాలి: ఇంటి పెద్దగా మారిన బాలుడు

By Siva KodatiFirst Published Oct 30, 2020, 4:28 PM IST
Highlights

కరోనా వైరస్ మనిషి జీవితాన్ని తలక్రిందులుగా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్‌కు ముందు.. కోవిడ్ తర్వాత అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా దాడికి గురయ్యారు.

కరోనా వైరస్ మనిషి జీవితాన్ని తలక్రిందులుగా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్‌కు ముందు.. కోవిడ్ తర్వాత అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా దాడికి గురయ్యారు.

ఇక రెక్కాడితే  కాని డొక్కాడని పేదల సంగతి మరీ దుర్భరం. ఉపాధి లేక వలస జీవులంతా కాలి నడకన స్వగ్రామాలకు తరలివెళ్లిన ఘటనలు ఇంకా మన కళ్ల ముందే వున్నాయి. ఈ క్రమంలో కరోనాతో కుటుంబం గడవలేని పరిస్ధితి చోటు చేసుకోవడంతో 14 ఏళ్ల బాలుడు ఇంటి బాధ్యతను నెత్తిన వేసుకున్నాడు,

వివరాల్లోకి వెళితే... ముంబైకి చెందిన సుభాన్‌ అనే బాలుడి కుటుంబం కూడా కరోనా కారణంగా ఉపాధిని పొగొట్టుకుంది. బతకడం భారంగా మారింది. దీంతో 14 ఏళ్ల వయసులో సుభాన్‌ తన వారిని పోషిండం కోసం తన చెల్లెలికి ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పించడం కోసం టీ అమ్మడం మొదలు పెట్టాడు.

టీ షాపు కూడా లేకపోవడంతో ఇంట్లో టీ తయారు చేసి వీధి వీధి తిరుగుతూ టీ విక్రయిస్తున్నాడు. ఈ విషయం గురించి సుభాన్‌ మాట్లాడుతూ, 12 ఏళ్ల క్రితమే తన తండ్రి మరణించాడని, అప్పటి నుంచి తన తల్లి బస్సు అటెండర్‌గా పనిచేస్తూ తమని పోషిస్తుందని  తెలిపాడు.

లాక్‌డౌన్‌ కారణంగా స్కూల్స్‌ మూతబడటంతో తన తల్లి ఉపాధి ​కోల్పోయిందని దాంతో ఆర్థికంగా కష్టాలను ఎదర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే టీ అమ్ముతున్నానని, దీని ద్వారా రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు వస్తున్నాయని చెప్పాడు. 

వాటిని తన తల్లికి ఇస్తున్నానని తెలిపాడు. తన చెల్లెళ్లు ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాస్‌ల ద్వారా చదువుకుంటున్నారని, స్కూల్‌ తెరవగానే తను కూడా స్కూల్‌కి వెళతానని తెలిపాడు. చదువుకోవాల్సిన చిన్న వయసులో సుభాన్‌ ఇలా ఇంటి బాధ్యతను తీసుకోవడంపై కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు ప్రభుత్వాల తీరును విమర్శిస్తున్నారు. 

click me!