ఇద్దరు బిడ్డలను పెట్టెలో పెట్టి తాళం వేసిన తల్లి

Published : Jun 29, 2019, 07:54 AM IST
ఇద్దరు బిడ్డలను పెట్టెలో పెట్టి తాళం వేసిన తల్లి

సారాంశం

కన్న తల్లే... కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల ప్రాణాలు తీసేసింది. బిడ్డలను పెట్టెలో పెట్టి తాళం వేసిందో తల్లి. దీంతో... ఊపిరాడక చిన్నారులు ఇద్దరూ కన్నుమూశారు.

కన్న తల్లే... కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల ప్రాణాలు తీసేసింది. బిడ్డలను పెట్టెలో పెట్టి తాళం వేసిందో తల్లి. దీంతో... ఊపిరాడక చిన్నారులు ఇద్దరూ కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భదోహీలోని ఖమారియా ప్రాంతంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఖమారియా ప్రాంతానికి చెందిన  ఓ వ్యక్తి పరిశ్రమలో పనిచేస్తాడు. వీరికి ఇద్దరు చిన్నారులు. ఆయన గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికొచ్చేసరికి పాప హతైనా (6), బాబు హసన్‌ (3)లు కనిపించలేదు. 

అనంతరం ఓ పెట్టెలో అపస్మారక స్థితిలో ఆ ఇద్దరు చిన్నారులను కనుగొన్న ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మతి స్థిమితం సరిగాలేని స్థితిలోనే ఆ పిల్లల తల్లి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే పిల్లల తల్లిని విచారించిన పోలీసు బృందం మాత్రం ఆమె మానసిక స్థితి సరిగానే ఉన్నట్లు గుర్తించిందని ఎస్పీ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Bhajan Clubbing : మోదీ మెచ్చిన భజన్ క్లబ్బింగ్.. ఇందులో అంత కిక్ ఏముంది? అసలు ఏంటిది?
Attari-Wagah Border Republic Day:భారత్- పాక్ సరిహద్దుల్లో నరాలు తెగిపడే ఉత్కంఠ | Asianet News Telugu