ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.. మృతదేహాలను తీసుకెళ్లం అంటూ నిరసన..ఎందుకంటే...

Published : Feb 14, 2022, 10:47 AM IST
ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ.. మృతదేహాలను తీసుకెళ్లం అంటూ నిరసన..ఎందుకంటే...

సారాంశం

ఓ వివాహిత ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. వారి మృతదేహాలు బావిలో తేలిని విషయం తెలిసిన భర్త, కుటుంబసభ్యులు పరారయ్యారు. దీంతో బెళగావిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 

బెంగళూరు :  belagavi లో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ, ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోగా.. భర్త, అత్తమామలను అరెస్ట్ చేసేంతవరకు అంత్యక్రియలు చేయబోమని మహిళ కుటుంబీకులు భీష్మించుకున్నారు. ఆదివారం బెలగావి బిమ్స్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆమె భర్త మనీష్, అతని కుటుంబమే ఆమెను హత్య చేశారని ఆరోపించారు.

వారందరినీ అరెస్టు చేసే వరకు మృతదేహాలను తీసుకునేది లేదంటూ ధర్నా నిర్వహించారు. దీంతో మూడు రోజుల నుంచి బిమ్స్ ఆసుపత్రి మార్చురీలోనే తల్లిపిల్లల మృతదేహాలు ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన బెళగావి హిండలగా గణపతి ఆలయం చెరువులో క్రిషా కేశ్వానీ (36),  పిల్లలు వీరెన్ (7), బావీర్ (4) మృతదేహాలు తేలాయి. ఇది తెలిసిన వెంటనే భర్త మనీష్, కుటుంబ సభ్యులు పరారయ్యారు.  కాగా, ఆదివారం మనీష్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ త్రిషకు వేరొకరితో సంబంధం ఉందని అదే ఆత్మహత్యలకు కారణం అని అన్నాడు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 7న Family strifeతో విసిగిపోయిన ఓ woman ముగ్గురు పిల్లలతో సహా jurala canalలోకి దూకిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని wanaparthy జిల్లా pebberuలో చోటుచేసుకుంది. ఇందులో ఓ బాలుడిని స్థానిక యువకుడు రక్షించగా.. మిగతా ముగ్గురు మాత్రం గల్లంతయ్యారు. పెబ్బేరు ఎస్ఐ రామస్వామి,  స్థానికుల కథనం ప్రకారం... పెబ్బేరు పట్టణానికి చెందిన డిసిఎం డ్రైవర్ తెలుగు స్వామి, భవ్యలు పదేళ్ల కిందట ప్రేమించుకుని, కులాంతర వివాహం చేసుకున్నారు.

వీరికి అయిదేళ్ల జ్ఞానేశ్వరి, మూడేళ్ల వరుణ్, ఏడాది వయసున్న నిహారిక సంతానం. కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో భార్యభర్తలు గొడవ పడుతున్నారు. ఆదివారం కూడా గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన భవ్య.. ముగ్గురు పిల్లలను తీసుకుని రాత్రి ఏడున్నర గంటల సమయంలో పట్టణ సమీపంలో ఉన్న జూరాల ఎడమ ప్రధాన కాలువలోకి దూకింది. స్థానికులు గమనించి కేకలు వేయడంతో.. అటువైపు వెళుతున్న కుమార్ అనే యువకుడు మూడేళ్ల వరుణ్ ని కాపాడగలిగాడు.

తల్లి, ఇద్దరు కుమార్తెలు మాత్రం గల్లంతయ్యారు. విషయం తెలిసిన ఎస్ఐ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే రామన్ పాడు జలాశయం అధికారులతో మాట్లాడి కాలువకు నీటి విడుదల నిలిపి వేయించారు. పూర్తి వివరాలు తెలుసుకుంటామని, ఉదయం గాలింపు చర్యలు చేపడతామని చెప్పారు. ఇప్పటివరకు తమకు ఎవరూ దీని మీద ఫిర్యాదు చేయలేదని అన్నారు. 

ఇలాగే, నిరుడు ఆగస్టులో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలు బావిలోకి తోసి, తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో కలకలం రేపింది. 'మీకు పెద్దపులిని చూపిస్త.. నాతో రండి'అని ఓ తల్లి తన ఇద్దరు కుమారులను గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్ల బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, పెద్దకుమారుడు మృతిచెందగా, చిన్నకుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంకిష్టంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

పోలీసుల కథనం ప్రకారం.. కిష్టంపేటకు చెందిన కస్తూరి సంపత్, లావణ్య(25) భార్యాభర్తలు. వీరికి గణేశ్ (8), హర్షవర్ధన్ (6) అనే కుమారులు ఉన్నారు. పదేళ్ల క్రితం స్టేషన్‌పూర్ నుంచి ఉపాధి కోసం కిష్టంపేట గ్రామానికి వచ్చారు. ఇక్కడే కూలీ పనిచేసుకుంటూ బతుకుతున్నారు. శుక్రవారం భార్యాభర్తలు అల్లీపూర్ గ్రామంలోని ఓ మేస్త్రీ వద్ద కూలీ పనిచేసి ఇంటికి తిరిగి వచ్చారు.కొద్ది సేపటికే ఈ దారుణానికి తెగబడింది. 
 

PREV
click me!

Recommended Stories

Monalisa Missing Mystery: మోనాలిసా మిస్సింగ్.. అసలేం జరిగిందంటే..? | Asianet News Telugu
Summer Trip : వేసవిలో చల్లచల్లగా.. ఇండియాలో తప్పక చూడాల్సిన 10 రిఫ్రెషింగ్ సిటీస్