చేతులకు, కాళ్లకు ఆరువేళ్లు...కోసేసిన తల్లి, చిన్నారి మృతి

sivanagaprasad kodati |  
Published : Dec 30, 2018, 11:44 AM IST
చేతులకు, కాళ్లకు ఆరువేళ్లు...కోసేసిన తల్లి, చిన్నారి మృతి

సారాంశం

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కాళ్లు, చేతులకు ఆరు వేళ్లతో పుట్టిన బిడ్డకు అలా ఉండటం అరిష్టమని భావించిన తల్లి కొడవలితో అదనంగా ఉన్న వేళ్లను కోసేయడంతో చిన్నారి మరణించింది. 

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కాళ్లు, చేతులకు ఆరు వేళ్లతో పుట్టిన బిడ్డకు అలా ఉండటం అరిష్టమని భావించిన తల్లి కొడవలితో అదనంగా ఉన్న వేళ్లను కోసేయడంతో చిన్నారి మరణించింది. వివరాల్లోకి వెళితే.. ఖండ్వా జిల్లాలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన తారాబాయి అనే మహిళకు ఈ నెల 22న చిన్నారి జన్మించింది.

బిడ్డ పుట్టిందని అయితే ఆ పాప కాళ్లు, చేతులకు ఆరేసి వేళ్లు ఉండటంతో కలత చెందింది.. అలా ఉండటం వల్ల ఆమెకు పెళ్లయ్యాక పెళ్లి కాదని భావించింది.  అంతే వెంటనే ఇంట్లో ఉన్న కొడవలి తీసుకుని అదనపు వేళ్లను కేసేసింది.

గాయాలపై ఆవు పేడ పూసింది.. ఆ తర్వాత కాసేపటికే తీవ్ర రక్త స్రావం కారణంగా చిన్నారి మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అదనపు వేళ్లు కారణంగా పెద్దయ్యాక పెళ్లి కాదేమోనన్న భయంతోనే తల్లి ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. పుట్టుకతో వచ్చిన శారీరక అసాధరణత కారణంగా మనుషుల్లో, జంతువుల్లో బహుళ అంగుళీకత వస్తుందని వైద్యులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు