భర్త మీద కోపం.. ఐదేళ్ల కుమారుడిని చంపేసి..

Published : Jun 11, 2020, 08:01 AM ISTUpdated : Jun 11, 2020, 08:27 AM IST
భర్త మీద కోపం.. ఐదేళ్ల కుమారుడిని చంపేసి..

సారాంశం

భర్తతో మనస్పర్థల కారణంగా తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన ఆమె.. మంగళవారం అర్థరాత్రి తన ఐదేళ్ల కుమారుడిని చేతిపారతో కొట్టి చంపేసింది. ఆ మృతదేహాన్ని ఇంటి వెనక బావిలో పడేయబోయింది.  

భర్త మీద కోపాన్ని ఆమె కన్న కొడుకు మీద చూపించింది. తన కడుపున పుట్టిన బిడ్డ అనే పాశం కూడా లేకుండా ప్రవర్తిచింది. అర్థరాత్రి అతి దారుణంగా కొడుకుని కొట్టి చంపేసి.. అనంతరం శవాన్ని బావిలో పడేయాలని చూసింది. అయితే ఆమె చేస్తున్న పనిని బంధువులు  కళ్లారా చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సదరు మహిళకు ముగ్గురు పిల్లలు. భర్తతో మనస్పర్థల కారణంగా తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన ఆమె.. మంగళవారం అర్థరాత్రి తన ఐదేళ్ల కుమారుడిని చేతిపారతో కొట్టి చంపేసింది. ఆ మృతదేహాన్ని ఇంటి వెనక బావిలో పడేయబోయింది.

ఆ సమయంలో ఆమె మేనల్లుడు దీన్ని గమనించి కేకలు వేయడంతో అందరూ ఆమె చేస్తున్న ఘోరాన్ని చూశారు. సదరు మహిళ మానసిక ఆరోగ్యం సరిగా లేనందునే ఈ చర్యలకు పాల్పడిందని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. భర్త మీద కోపంతో ఇలా చేసిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు