
అస్సాంలో సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన చోటుచేసుకుంది. ఎనిమిది మంది కామాంధులు ఒక వృద్ధ మహిళ ఇంట్లోకి చొరబడి మూగ మహిళ, ఆమె కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.అంతటితో ఆగకుండా వారి ప్రయివేట్ పార్ట్స్ పై కారం చల్లారు. ఈ ఘటన గత రెండు నెలల కింద జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించగా.. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
పలు కథనాల ప్రకారం.. సత్‌గావ్‌లోని తల్తాలాలోని మూగ మహిళ, ఆమె కూతురు కలిసి నివాసిస్తున్నారు. అదే గ్రామంలో నివసిస్తున్న 55 ఏళ్ల అరుణ్ ప్రధాన్ అనే కుటుంబానికి ఏదో విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో మే 17న అరుణ్ ప్రధాన్ కుమారుడు అమిత్ ప్రధాన్‌తో పాటు మరో ఏడుగురు వ్యక్తులు బాధితురాలి ఇంట్లోకి చొరబడి.. మూగ మహిళ, ఆమె కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా.. వారి ప్రైవేట్ పార్ట్స్ పై కారం పొడిని చల్లారు. దీంతో తల్లి, కూతుళ్లు ఇద్దరూ స్పృహ కోల్పోయారు. వారి ఇరుగుపొరుగు వారి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న సత్‌గావ్ పోలీసులు.. బాధితులను గువాహటి మెడికల్ కాలేజీకి తరలంచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అమిత్ ప్రధాన్, బిమల్ చెత్రీ, ఛాయా ప్రధాన్ , సంధియా సోనార్ ప్రధాన అనుమానితులుగా ఉన్నారు. వీరిని అరెస్టు చేసి..అదుపులోకి తీసుకున్నారు. మిగితా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.