Today Top Stories: శుభోదయం.. ఈ రోజు టాప్ సోర్టీస్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే.. ? రెండో టీ20 నేడే.. ఇండోర్‌లో టాసే కీలకం.. , బెజవాడ రాజకీయాల్లో కీలక మలుపు.. వైసీపీ కీలక నేతతో వంగవీటి రాధ భేటీ , ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త .. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ ప్రకటన,బాబుతో భేటీ తర్వాత షర్మిల, మణిపూర్ పర్యటనలో సీఎం రేవంత్ వంటి పలు వార్తల సమాహారం
Today Top Stories:
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu)తో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక భేటీ దాదాపు మూడున్నర గంటలపాటు సాగింది. సంక్రాంతి సందర్భంగా పవన్‌ను భోజనానికి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సమావేశంలో నారా లోకేష్‌తో పాటు నాదెండ్ల మనోహర్, ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా పాల్గొన్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం - జనసేన సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
బెజవాడ రాజకీయాల్లో కీలక మలుపు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అసమ్మతి నాయకులు పార్టీలు మారుతున్నారు. తాజాగా, అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ కూడా పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. సమయం, సందర్భం కోసం వేచి ఉన్నాడని .. కర్టెక్ సమయం చూసి.. పార్టీ ఫిరాయించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనతో శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. గత పరిచయం ద్రుష్టిలో ఉంచుకుని, టీడీపీ అధినేత భవకుమార్ ను పార్టీలోకి ఆహ్వనించాల్సిందిగా.. రాధాను కోరినట్టు తెలుస్తోంది. దాదాపు గంటకు పైగా సాగిన వీరి భేటీ రాజకీయంగా చర్చనీయంగా మారింది. భవకుమార్ కు వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉండటంతో టీడీపీలోకి అడుగుపెట్టడం ఖాయమనిపిస్తుంది.
వైసీపీకి మరో భారీ షాక్.. .
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం రవత్తరంగా మారుతోంది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే.. ఏపీలో రాజకీయ సందడి జోరందుకుంది. రాజకీయ సమీకరణలు, పార్టీ ఫిరాయింపులు, పొత్తుల కోలాహలం, సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఖరారు, ప్రకటించిన అభ్యర్థుల ప్రచారంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే పలువురు నేతలు అధికార పక్షం వైసీపీకి షాక్ ఇచ్చాడు. తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. మచిలీపట్నం ఎంపీ బాలసౌరి వల్లభనేని పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గత కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్నారు. మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో గత కొంతకాలంగా బాలశౌరికి పడటం లేదు. ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం ద్రుష్టికి పేర్ని నానికి అండగా నిలిచింది.
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త .. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ ప్రకటన
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి తర్వాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వుంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇప్పటికే మెగా డీఎస్సీపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించడం జరిగిందని, పోస్టుల సంఖ్య , ఉద్యోగాల భర్తీపై విధి విధానాలను త్వరలోనే తెలియజేస్తామని బొత్స వెల్లడించారు.
బాబుతో షర్మిల భేటీ
చంద్రబాబుతో భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని వై.ఎస్. షర్మిల స్పష్టం చేశారు.తన కొడుకు రాజారెడ్డి పెళ్లికి రావాలని ఆహ్వానించినట్టుగా వై.ఎస్. షర్మిల చెప్పారు. తనతో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు పంచుకున్నారని వై.ఎస్. షర్మిల చెప్పారు. క్రిస్‌మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు కుటుంబానికి కేక్ ను పంపినట్టుగా ఆమె చెప్పారు. లోకేష్ కూడ తనకు గిఫ్ట్ పంపిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబుకే కాదు, కవిత, హరీష్ రావు లాంటి వాళ్లకు కూడ తాను క్రిస్‌మస్ గిఫ్ట్ లు పంపిన విషయాన్ని షర్మిల ఈ సందర్భంగా వివరించారు. తన కొడుకు పెళ్లిని పురస్కరించుకొని అనేక మంది రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్టుగా షర్మిల చెప్పారు. ఈ క్రమంలోనే చంద్రబాబును కూడ ఆహ్వానించామన్నారు.
మణిపూర్ పర్యటనలో సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (జనవరి 14) మణిపూర్ వెళ్లనున్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో నాయ్ యాత్ర ప్రారంభించనున్నారు. మణిపూర్ నుంచి ముంబయి వరకు ఈ యాత్ర కొనసాగనుంది. రాహుల్ గాంధీ ప్రారంభించనున్న భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు రేపు సీఎం రేవంత్ రెడ్డి మణిపూర్ కు బయల్దేరి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆయన ఢీల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి నేరుగా మణిపూర్ కు వెళ్లి యాత్రలో పాల్గొంటారు.
`జాతిరత్నం`అనుదీప్‌తో రవితేజ మూవీ..
మాస్ మహారాజా రవితేజ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఆయన కొత్త సినిమా ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ఆయన కొత్త మూవీ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. అయితే ఇది ఆల్మోస్ట్ కన్ఫమ్ అంటున్నారు. సితార బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కనుందట. అయితే సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. రేపుగానీ, ఎల్లుండి గానీ ఈ మూవీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ముందుగా ఈ సంక్రాంతికి ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించాలనుకున్నారట. కానీ `గుంటూరు కారం` రిజల్ట్ పరిణామాల నేపథ్యంలో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని, కేవలం అధికారిక ప్రకటన మాత్రమే రాబోతుందని తెలుస్తుంది. మరి నిజం ఏంటో తెలియాలి.
రెండో టీ20 నేడే.. ఇండోర్‌లో టాసే కీలకం..
IND vs AFG: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం (Holkar Stadium - Indore)లో నేడు భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో రోహిత్ సేన ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ తరుణంలో ఇండోర్ టీ20 మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి.. సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్ లో టాసే కీలకం. ఇండోర్‌లో రాత్రి ఉష్ణోగ్రత దారుణంగా పడిపోయే అవకాశముంది. అలాగే.. రాత్రి పెరిగే కొద్దీ మంచు దానిపై ప్రభావం చూపుతుంది. ఇటువంటి పరిస్థితిలో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.