
Firing in West Delhi: దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గుర్తు తెలియని ఆగంతకులు జనావాసాలపైకి కాల్పులకు తెగబడ్డారు. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి నిర్భయ దుండగులు 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీంతో అక్కడి ప్రజలు భయంతో పరుగులు వేరే ప్రాంతాలకు పరుగులు పెట్టారు. వెంటనే ఉన్నతాధికారులు స్పాట్ కు చేరుకున్నారు.
అప్రమత్తమైన అధికారులు అదనపు బలగాలను ఆ ప్రదేశంలో మోహరించారు. మరోవైపు ఈ కాల్పుల ఘటన తర్వాత ఆ ప్రాంతంలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేశారు. ఘటనపై స్థానికుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా పోలీసులకు అందింది. ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పరస్పర శత్రుత్వం కారణంగానే ఆ ప్రాంతంలో కాల్పుల ఘటన చోటుచేసుకుందని కొందరు అంటున్నారు. అదే సమయంలో అధికారులు ఉగ్రవాదులు దాడిజరిపారా.. మరేదైన ఉందా అన్న కోణంలో విచారణ చేపట్టారు. .
ఢిల్లీ పోలీసుల పలు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భద్రత బలగాలు అణువణువు గాలిస్తున్నారు. ఆ ప్రాంతాలను తమ ఆధీనంలో తెచ్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారి నుంచి కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
అదే సమయంలో అనుమానాస్పద వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం, హనుమాన్ జయంతి సందర్భంగా ఊరేగింపులో ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు పోలీసులు, స్థానికులు గాయపడ్డారు. జహంగీర్‌పురి హింసను దృష్టిలో ఉంచుకుని, సుభాష్ నగర్ ప్రాంతంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు, అలాగే పుకార్లను పట్టించుకోవద్దని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలీసులు. ఈ ఘటనలో అజయ్ చౌదరి, జస్సా చౌదరి గాయపడినట్టు తెలిపారు.