మోర్బీ బ్రిడ్జి విషాదంలో కీలక పరిణామం.. ఒరెవా గ్రూప్‌ ఎండీ జయసుఖ్‌ పటేల్‌ని కస్టడీకి తరలించిన కోర్టు..

By Rajesh KarampooriFirst Published Feb 2, 2023, 4:24 AM IST
Highlights

గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి ప్రమాదంలో నిందితుడైన ఒరెవా గ్రూప్‌ ఎండీ జయసుఖ్‌ పటేల్‌ను కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఈ ప్రమాదంలో 135 మంది మరణించారు. జైసుఖ్ మంగళవారం కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసులో 1,262 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. ఇందులో జైసుఖ్ పటేల్ పేరును కూడా నిందితుడిగా చేర్చారు. ఈ ఘటన గతేడాది అక్టోబర్‌లో జరిగిన సంగతి తెలిసిందే.

మోర్బీ బ్రిడ్జి విషాదం: గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడైన  ఒరేవా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ జయసుఖ్ పటేల్‌ను కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఈ ప్రమాదంలో 135 మంది మరణించారు. జైసుఖ్ మంగళవారం కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసులో 1,262 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. వంతెన మరమ్మతులు చేసిన ఒరెవా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జైసుఖ్ పటేల్ పేరును కూడా నిందితుడిగా చేర్చారు. ఈ ఘటన గతేడాది అక్టోబర్‌లో జరిగిన సంగతి తెలిసిందే.
 
మోర్బి వంతెన ప్రమాదం  

గతేడాదిఅక్టోబరు 30న సాయంత్రం 6.32 గంటలకు మోర్బీలోని మణి మందిర్ సమీపంలోని మచ్చు నదిపై ఉన్న 140 ఏళ్ల నాటి వేలాడే వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చాలా మంది అమాయక చిన్నారులు సహా 135 మంది ప్రాణాలు కోల్పోయారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్రమాద సమయంలో 400 మందికి పైగా ఉన్నారు. వంతెన సామర్థ్యం 100 మంది. మోర్బి రాజు సర్ వాఘ్జీ ఈ కేబుల్ బ్రిడ్జిని తన రాజాస్థానం నుండి రాజ్ మహల్‌కు వెళ్లేందుకు ఉపయోగించారు. ఈ వంతెన అతని హయాంలో నిర్మించబడింది. రాజు తన రాచరికం ముగిసిన తర్వాత ఈ వంతెన బాధ్యతను మోర్బీ మున్సిపాలిటీకి అప్పగించాడు.

ఈ క్రమంలో వచ్చే 15 సంవత్సరాలకు అంటే 2037 వరకు వంతెన మరమ్మతు, నిర్వహణ బాధ్యతలను ఒరెవా కంపెనీకి అప్పజెప్పింది మోర్బీ మున్సిపాలిటీ. ఈ మేరకు ఇరువురి మధ్య ఒప్పందం కుదురింది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం.. వంతెనను మర్మమత్తు చేసి 8 నుండి 12 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలి. కానీ 6 నెలల్లో ఎటువంటి సాంకేతిక సహాయం లేకుండా వంతెన పునరుద్ధరణకు కాంట్రాక్ట్ ఇవ్వబడింది. ప్రమాదం సమయంలో.. వంతెనపైకి 400 మందికి పైగా వెళ్లేందుకు అనుమతించారు.

మోర్బిలో మచ్చు నదిపై బ్రిటిష్ కాలం నాటి వేలాడే వంతెన 2022 అక్టోబర్ 30న కూలిపోయింది. ఈ సందర్భంలో.. రాష్ట్ర ప్రభుత్వం గత వారం మోర్బి ప్రమాదంలో షో-కాజ్ నోటీసు జారీ చేసింది . తన బాధ్యతను నెరవేర్చలేకపోయినందుకు మున్సిపాలిటీని ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించారు. దీనిపై జనవరి 25లోగా లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఆ నోటీసులో మున్సిపాలిటీని ఆదేశించింది.

click me!