క్యాష్ బ్యాగును లాక్కెళ్లిన కోతి: కరెన్సీ నోట్లు వెదజల్లిన మర్కటం, ఎగబడ్డ జనం

Published : Dec 23, 2020, 02:26 PM IST
క్యాష్ బ్యాగును లాక్కెళ్లిన కోతి: కరెన్సీ నోట్లు వెదజల్లిన మర్కటం, ఎగబడ్డ జనం

సారాంశం

ఓ కోతి  రూ. 4 లక్షలు ఉన్న క్యాష్ బ్యాగ్ తో కోతి పారిపోయింది. అంతేకాదు ఈ బ్యాగులో ఉన్న క్యాష్ ను రోడ్డుపై వెదజల్లింది.బ్యాగ్ లోని రూ. 14 లక్షలు లేకుండా పోయాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

లక్నో: ఓ కోతి  రూ. 4 లక్షలు ఉన్న క్యాష్ బ్యాగ్ తో కోతి పారిపోయింది. అంతేకాదు ఈ బ్యాగులో ఉన్న క్యాష్ ను రోడ్డుపై వెదజల్లింది.బ్యాగ్ లోని రూ. 14 లక్షలు లేకుండా పోయాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ లో  సీనియర్ సిటిజన్  రూ. 4 లక్షలను బ్యాగ్ లో పెట్టుకొని వికాస్ భవన్ రిజిస్ట్రీ కార్యాలయానికి చేరుకొన్నాడు.

సీనియర్ సిటిజన్ చేతిలోని బ్యాగ్ ను ఓ కోతి లాక్కెళ్లింది. సీనియర్ సిటిజన్ నుండి బ్యాగ్ తో తీసుకొని సమీపంలోని చెట్టు ఎక్కింది  కోతి. 

బ్యాగ్ ను ఓపెన్ చేసి బ్యాగులో ఉన్న డబ్బును ఆ కోతి వెదజల్లింది. ఈ డబ్బు కోసం కొందరు జనం ఎగబడ్డారు. మరికొందరు చెట్టుపై ఉన్న కోతి  వద్ద ఉన్న బ్యాగును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. 

జనం ఎక్కువగా  చేరడంతో భయపడిన కోతి చేతిలోని బ్యాగును వదిలేసి  పారిపోయింది. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాగు నుండి పోయిన రూ. 14 వేల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu