స్నేహమంటే మనదేరా అంటున్న కోతి, పిల్లి.. ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో..!

Published : Nov 30, 2022, 09:40 AM IST
 స్నేహమంటే మనదేరా అంటున్న కోతి, పిల్లి.. ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో..!

సారాంశం

కోతి ప్రేమగా వెళ్లి.. దానిని తోకతో.. ఇంకా తన చేతులతో హగ్ చేసుకుంది. దీనికి సంబంధించిన చిన్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ కాగా... వాటికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.


జంతువులకు సంబంధించిన వీడియోలు చూడటం మీకు బాగా ఇష్టం అయితే... మీరు కచ్చితంగా ఈ వీడియో  చూడాల్సిందే. నిజానికీ కోతి, పిల్లికి పెద్దగా పడదు. అలాంటిది... ఈ రెండింటి మధ్య స్నేహం కుదిరింది. పిల్లి ఓ ప్లేస్ లో పడుకొని ఉంటే.... కోతి ప్రేమగా వెళ్లి.. దానిని తోకతో.. ఇంకా తన చేతులతో హగ్ చేసుకుంది. దీనికి సంబంధించిన చిన్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ కాగా... వాటికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఇది ఎక్కడ జరిగింది అనే విషయం తెలియదు కానీ... ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. 7 సెకన్లు ఉన్న ఈ వీడియోలో... కోతి.. పిల్లిని హగ్ చేసుకొని, ముద్దు కూడా పెట్టింది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 1,60,000లకు పైగా వ్యూస్ వచ్చాయి. కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ రెండు జంతువుల స్నేహం చాలా అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్  చేస్తుండటం గమనార్హం.

ఇలాంటి స్నేహం చాలా అరుదుగా ఉంటుందని కొందరు మెసేజ్ చేయగా.... వీరు స్నేహం అందరికీ ఆదర్శం అని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌