ఉప ఎన్నికల బరిలో మోహన్ బాబు

Published : Sep 29, 2019, 11:17 AM IST
ఉప ఎన్నికల బరిలో మోహన్ బాబు

సారాంశం

ఉపఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మోహన్ బాబు బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఇతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ఉపఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మోహన్ బాబు బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఇతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. బెంగళూరు శివారుప్రాంతమైన కేఆర్ పురం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇతను పోటీకి దిగనున్నాడు. 

 కేంబ్రిడ్జి గ్రూప్ అఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేతగా ఇతనికి మంచిపేరుంది. సమాజ సేవకుడిగా ఎన్నో సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎందరో పేదలకు తన సంస్థలద్వారా అవసరమైన సహాయాన్ని చేసాడు. 

రెండు దఫాలు ఇక్కడినుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ రాజీనామా చేసారు. రాజీనామాలు  చేసి కాంగ్రెస్ జేడీఎస్ ల కూటమి అధికారాన్ని కోల్పోవడానికి కారణమైన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలలో బసవరాజ్ కూడా ఒకరు. 

ఉప ఎన్నికల నేపథ్యంలో ఇలా మోహన్ బాబు రూపంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా కృష్ణరాజపురం ఉప ఎన్నిక మరింత రంజుగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్