
కేంద్ర మంత్రి వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని 17 రకాల పంటలకు కనీస మద్ధతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. కందులపై క్వింటాల్‌కు రూ.300, పెసర్లపై క్వింటాల్‌కు రూ.480, పొద్దు తిరుగుడుపై క్వింటాల్‌కు రూ.385, సోయాబిన్‌పై క్వింటాల్‌కు రూ.300, నువ్వులపై క్వింటాల్‌కు రూ.523 పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.