Agnipath Recruitment Scheme Row : యూపీలో రైల్వే స్టేషన్ పై యువకుల దాడి.. ట్రైన్ కు నిప్పు, ఆస్తుల ధ్వంసం..

Published : Jun 17, 2022, 09:35 AM IST
Agnipath Recruitment Scheme Row : యూపీలో రైల్వే స్టేషన్ పై యువకుల దాడి.. ట్రైన్ కు నిప్పు, ఆస్తుల ధ్వంసం..

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో అగ్నిపథ్ నిరసనలు తీవ్రంగా మారాయి. ఈ నిరసనకు సంబంధించిన వీడియోల్లో రైల్వే స్టేషన్‌లోని దుకాణాలు, బెంచీలను కర్రలతో యువకులు పగలగొట్టడం కనిపిస్తున్నాయి

లక్నో : కొత్త మిలటరీ రిక్రూట్‌మెంట్ పాలసీ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ ఉదయం ఒక గుంపు రైల్వేస్టేషన్ మీద దాడికి దిగింది. రైల్వే స్టేషన్ లోని షాపులను, రైళ్లను కర్రలతో ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని చెదరగొట్టడానికి రంగంలోకి దిగేసమయానికే చాలా మేరకు రైల్వే స్టేషన్ ఆస్తులను ఈ నిరసనకారులు ధ్వంసం చేశారు. 

దీనికి సంబంధించిన కొన్ని అంశాలు ఇవి... 

- వారితో మాట్లాడిన తర్వాత గుంపును చెదరగొట్టగలిగామని బల్లియా పోలీసులు చెప్పారు.

- తూర్పు యుపి జిల్లాలోని రైల్వే స్టేషన్ వెలుపల వీధుల్లో కర్రలు చేతపట్టుకున్న మరో వర్గం నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

- నిరసన వీడియోల్లో రైల్వే స్టేషన్‌లోని దుకాణాలు, బెంచీలను యువకులు దుడ్డుకర్రలతో బద్దలు కొట్టినట్టు  చూపిస్తున్నాయి.

- "పోలీసులు సరైన సమయంలో రంగంలోకి దిగి... పెద్ద ఎత్తున నష్టం జరగకుండా ఆపగలిగారు. ఈ ఘటనలో పాల్గొన్నవారందరిమీద చర్య తీసుకుంటాము," అని బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ సౌమ్య అగర్వాల్ విలేకరులతో అన్నారు.

- ఈ నిరసనలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు ఈ వీడియోలను పరిశీలిస్తున్నామని బల్లియా పోలీస్ చీఫ్ రాజ్ కరణ్ నయ్యర్ తెలిపారు. "వారిని కనిపెట్టిన తరువాత సరైన చర్యలు తీసుకుంటాం" అని నయ్యర్ చెప్పారు.

- బీహార్‌లోని పలు ప్రాంతాల్లో సైన్యం ఆశావహులు రైలు, రోడ్డు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన మరుసటి రోజే.. ఈ ఉదయం ఈ నిరసన జరిగింది. ఈ నిరసన హర్యానా, యూపీలకు కూడా వ్యాపించింది.

- హర్యానాలోని పల్వాల్ జిల్లాలో నిరసనకారుల రాళ్ల దాడి, హింసాకాండతో ఫోన్ ఇంటర్నెట్,  SMS సౌకర్యాలు 24 గంటలపాటు నిలిపివేయబడ్డాయి.

- గ్రాట్యుటీ, పెన్షన్ ప్రయోజనాలు లేకుండా చాలా మందికి నిర్బంధ పదవీ విరమణతో పాటు నాలుగు సంవత్సరాల కాలానికి కాంట్రాక్ట్‌పై జవాన్ల నియామకాన్ని అగ్నిపథ్ ప్రతిపాదిస్తుంది. కొత్త ప్రణాళికలో ప్రభుత్వం.. భారీ జీతం ఇంకా పెన్షన్ బిల్లులను తగ్గించడం.. ఆయుధాలు కొనుగోలు చేయడానికి నిధులను విడుదల చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

- నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం అగ్నిపత్ రిక్రూట్‌మెంట్ వయోపరిమితిని 21 నుంచి 23కి పెంచింది.

- ప్రభుత్వం ఈ పథకం  10-పాయింట్ డిఫెన్స్‌ను కూడా పేర్కొంది. రిక్రూట్‌లు నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో తమ కాంట్రాక్ట్ ను పూర్తి చేసిన తర్వాత.. వారికి ఇది నచ్చుతుందని..లోటుగా అనిపించదని హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?