అనాథ వృద్ధుడికి ఎమ్మెల్యే అంత్యక్రియలు

By telugu news teamFirst Published May 2, 2020, 9:04 AM IST
Highlights

మూడేళ్ల క్రితం తంజావూరు జిల్లా పేరావూరానికి వచ్చారు. అప్పటి నుంచి వారు నీలకంఠపు పిల్లయార్‌ ఆలయం ముందు బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఆలయం మూతపడింది. 

అనాథ వృద్ధుడికి ఓ ఎమ్మెల్యే అంత్యక్రియలు నిర్వహించాడు. దీంతో.. సదరు ఎమ్మెల్యే పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం నాగై  జిల్లా వేలాంకన్ని ప్రాంతానికి చెందిన వ్యక్తి మురగన్(78), అతని భార్య అంజమ్మల్(68) బిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. మూడేళ్ల క్రితం తంజావూరు జిల్లా పేరావూరానికి వచ్చారు. అప్పటి నుంచి వారు నీలకంఠపు పిల్లయార్‌ ఆలయం ముందు బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఆలయం మూతపడింది. 

దీంతో మురుగన్‌ దంపతులకు సామాజిక సేవకులు ఆహారం అందజేస్తూ వచ్చారు. ఈ స్థితిలో గురువారం మరుగుదొడ్డికి వెళ్లిన మురుగన్‌ స్ఫహ తప్పి పడిపోయాడు. ఎంత సేపటికి రాకపోవడతో అంజమ్మాల్‌ అక్కడికి వెళ్లగా మురుగన్‌ విగతజీవిగా పడి ఉండడం చూసి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పేరావూరని ఎమ్మెల్యే గోవిందరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మురుగన్‌ బౌతికకాయనికి పూలమాల వేసి అంజలి ఘటించారు. 

మృతుడి భార్యకు ఆర్థిక సాయం అందించారు. అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేకు అభినందనలు వెల్లువెత్తాయి. అంత్యక్రియలు జరిపించిన వారిలో పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అరుణ్‌ కుమార్, గ్రామనిర్వాహక అధికారి శక్తివేల్‌ ఉన్నారు.   

click me!