Mizoram Election Results 2023 : మిజోరంలో జెడ్‌పీఎం ఘన విజయం.. సీఎం జోరంతంగా ఓటమి

By Siva Kodati  |  First Published Dec 4, 2023, 4:17 PM IST

ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) ఘన విజయం సాధించింది. జెడ్‌పీఎంకు 27 సీట్లు, ఎంఎన్ఎఫ్‌కు 10 సీట్లు వచ్చాయి. సీఎం జోరంతంగా సహా డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులను చిత్తుగా ఓడించారు జనం. 


ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం) ఘన విజయం సాధించింది. జెడ్‌పీఎంకు 27 సీట్లు, ఎంఎన్ఎఫ్‌కు 10 సీట్లు వచ్చాయి. 40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరంలో ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్థానాలు 21. అయితే ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి గట్టి షాకిచ్చారు. ఏకంగా సీఎం జోరంతంగా సహా డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులను చిత్తుగా ఓడించారు. దీంతో త్వరలోనే జెడ్‌పీఎం అధ్యక్షుడు లాల్‌దుహోమా నేతృత్వంలో మిజోరంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 

కాగా.. ఈ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ చీఫ్, ముఖ్యమంత్రి జోరంతంగా ఐజ్వాల్ తూర్పు 1 నుంచి బరిలోకి దిగారు. ఆయనపై జెడ్‌పీఎం అభ్యర్ధి లాల్తన్‌సంగా 2,100 ఓట్ల తేడాతో గెలుపొంది సంచలనం సృష్టించారు. డిప్యూటీ సీఎం తాన్ లుయాను జెడ్‌పీఎం అభ్యర్ధి 909 ఓట్లతో ఓడించారు. మిజోరంలో బీజేపీకి రెండు సీట్లు దక్కాయి. పాలక్, సైహా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు గెలిచారు. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. గత ఎన్నికల్లో మిజోరంలో కాంగ్రెస్ ఐదు స్థానాలను గెలుచుకోగా.. ఇప్పుడు కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. 

Latest Videos

click me!