బాలికను తల్లిని చేసిన ప్రిన్సిపాల్..అత్యాచారాన్ని వీడియో తీసి 9 నెలలుగా

Published : Sep 20, 2018, 12:05 PM IST
బాలికను తల్లిని చేసిన ప్రిన్సిపాల్..అత్యాచారాన్ని వీడియో తీసి 9 నెలలుగా

సారాంశం

పాఠశాలకు, విద్యార్థులకు రక్షణగా ఉంటూ.. వారి బాగోగులు చూడాల్సిన ప్రిన్సిపాల్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి... ఆమెను తల్లిని చేశాడు. బిహార్ రాజధాని పాట్నాకు చెందిన బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది.

అయితే ఒక రోజు సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి తిరిగివచ్చిన బాలిక వాంతులు చేసుకుని.. స్పృహ తప్పిపడిపోయింది. దీంతో ఆమె తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించింది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెను గర్భవతని తేల్చారు. బాలికను నిలదీయగా జరిగిన విషయం మొత్తం తల్లికి చెప్పింది.

ఎక్సర్‌సైజ్ బుక్ చూడాలని చెప్పి ప్రిన్సిపాల్ తనను గదిలోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడని.. దీనిని క్లర్కుతో వీడియో తీయించి బయట ఎవరికైనా చెబితే అందరికి చూపిస్తానని బెదిరించి.. 9 నెలలుగా తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రిన్సిపాల్‌తో పాటు క్లర్కును అరెస్ట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu