ఫోన్ దొంగతనం చేశాడని.. పన్నెండేళ్ల చిన్నారిపై పైశాచితక్వం.. బావిలో వేలాడదీసి క్రూరత్వం...

By SumaBala BukkaFirst Published Oct 18, 2022, 2:02 PM IST
Highlights

మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడంటూ.. ఓ పన్నెండేళ్ల చిన్నారిని బావిలో వేలాడదీసి పైశాచికత్వం ప్రదర్శించాడు ఓ వ్యక్తి. దీన్నంతా అటుగా వెడుతున్న వ్యక్తి వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడంటే ఓ మైనర్ బాలుడిని బావిలో వేలాడదీశాడు ఓ వ్యక్తి. తాను దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా సరే అతను వినలేదు. కనీసం కనికరం లేకుండా పన్నెండేళ్ల బాలుడిని  దారుణంగా కొట్టి బావిలో వేలాడదీశాడు. పైగా ఈ దృశ్యాన్ని మరో వ్యక్తి మొబైల్లో చిత్రీకరించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని చతర్పూర్ జిల్లాలో జరిగింది. చిన్నారిని చిత్రహింసలు పెట్టిన సమయంలో వీడియో తీసిన మరో వ్యక్తి ఆ వీడియోను చిన్నారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్ళాడు.

దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే, పోలీసులు తనను కూడా స్టేషన్ కు పిలిచి నిందితులతో పాటు కొట్టాడని.. వీడియో తీసిన వ్యక్తి ఆరోపించాడు. లవకుశ్ నగర్ లోని ఆక్టోపస్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మొబైల్ దొంగతనం చేశాడని బాలుడిని పట్టుకున్న నిందితుడు.. దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా 20 అడుగుల లోతైన బావిలో ఐదు నిమిషాలపాటు ఒక చేత్తో పట్టుకుని వేలాడదీశాడు.

అక్టోబ‌ర్ 23న ఆయోధ్య‌కు ప్ర‌ధాని మోడీ.. రామాలయ ప‌నుల ప‌రిశీల‌న

ఆ బాలుడు తాను దొంగతనం చేయలేదని వేడుకుంటున్నా కనీసం కనికరించలేదు. ఈ సమయంలో అటుగా వెళుతున్న యువకులు ఇదంతా ఓ వీడియో తీసి.. బాధిత చిన్నారి తల్లిదండ్రులకు చూపించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం బాధిత చిన్నారితో కలిసి తల్లిదండ్రులు లవకుశ నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఇంచార్జ్  హేమంత్ నాయక్, నిందితుడు అజిత్ రాజుపై హత్యాయత్నం ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

అయితే, తాను ఈ దృశ్యాన్ని రికార్డు చేసి బాధిత బాలుడి  తల్లిదండ్రులకు చూపించడంతోనే ఈ ఘటన కలకలం రేపిందని..  లేకపోతే ఇంత జరిగేది కాదంటూ అవుట్ పోస్ట్ ఇన్చార్జి  ప్రతాప్ దూబే తనను కొట్టారని.. కులంపేరుతో దూషించారని వీడియో తీసిన వ్యక్తి కిషోర్ ఆరోపిస్తున్నాడు.  కాగా,  బావిలో 14 అడుగుల మేర నీరు నిండి ఉందని.. నిందితుడు బాలుడిని వదిలేస్తే చనిపోయే వాడిని..  బాధిత బాలుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. వీడియో చూడగానే గుండె తరుక్కుపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!