మైనర్ బాలికపై చర్చి ఫాదర్ అఘాయిత్యం.. సైక్లింగ్ కోసం వచ్చిన సమయంలో..

Published : Apr 25, 2022, 04:47 PM IST
మైనర్ బాలికపై చర్చి ఫాదర్ అఘాయిత్యం.. సైక్లింగ్ కోసం వచ్చిన సమయంలో..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలికపై చర్చి ఫాదర్ అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలికపై చర్చి ఫాదర్ అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. చాందినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చర్చి పక్కన దళిత బాలిక కుటుంబం నివసిస్తోంది. అయితే బాలిక సైక్లింగ్ కోసం చర్చికి వెళ్లిందని.. ఆ సమయంలో చర్చి ఫాదర్‌ ఆల్బర్ట్ అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. 

అయితే బాలిక ఇంటికి చేరుకున్న తర్వాత ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో బాలిక తల్లి చాందినగర్ పోలీసుకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చర్చి ఫాదర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

ఏప్రిల్ 23న చర్చి ఫాదర్‌‌పై బాలిక తల్లి ఫిర్యాదు చేసినట్లు సర్కిల్ ఆఫీసర్ విజయ్ చౌదరి తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. 

ఈ ఘటనపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) నీరజ్ కుమార్ జాదౌన్ మాట్లాడుతూ.. నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలిపారు. జిల్లా  ఆస్పత్రిలో.. బాధితురాలు, నిందితుడి డీఎన్‌ఏ శాంపిల్స్‌ను వైద్య పరీక్షల నిమిత్తం సేకరించినట్టుగా చెప్పారు. రెండు నమునాలను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపనున్నట్టుగా తెలిపారు. ఫోరెన్సిక్ బృందం కూడా చర్చిన సందర్శించనుందని చెప్పారు. ఇక, ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం ఉన్న దృష్ట్యా.. చర్చి వద్ద పోలీసులను మోహరించినట్టుగా తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం