దారుణం : పదమూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారం..

Published : Aug 12, 2021, 04:50 PM IST
దారుణం : పదమూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారం..

సారాంశం

గోవాలోని సతారి తాలూకా పార్వే గ్రామానికి చెందిన బాలికను మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా దొడమార్గ్ తాలూకాకు చెందిన వసంత్ నాయక్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. 

గోవా : పనాజీలో దారుణం జరిగింది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, ఆమె మీద అత్యాచారం చేసిన దారుణ ఘటన గోవాలో తాజాగా వెలుగుచూసింది. గోవా రాష్ట్రానికి చెందిన 13 యేళ్ల బాలికను మహారాష్ట్రకు చెందిన అక్షయ్ వసంత్ నాయక్ (31) అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. 

గోవాలోని సతారి తాలూకా పార్వే గ్రామానికి చెందిన బాలికను మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా దొడమార్గ్ తాలూకాకు చెందిన వసంత్ నాయక్ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. 

బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గోవా పోలీసులు నిందితుడైన నాయక్ ను అరెస్ట్ చేశారు. జులై 25వతేదీన గోవాలోని బెనౌలిమ్ బీచ్ లో ఇద్దరు మైనర్ బాలికలమీద నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. గోవాలో తరచూ జరుగుతున్న అత్యాచారం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

52 KM Concrete Road in 6 Days: 6 రోజుల్లో 52 కిలోమీటర్లు రెండు గిన్నీస్ రికార్డులు| Asianet Telugu
DMart : ఉద్యోగులకు డీమార్ట్ స్పెషల్ డిస్కౌంట్స్, బంపర్ ఆఫర్లు.. భారీగా డబ్బులు సేవ్..!