మైనర్ బాలికను చంపేసి.. చెట్టుకు వేలాడదీసి..!

Published : Aug 06, 2021, 08:26 AM ISTUpdated : Aug 06, 2021, 08:30 AM IST
మైనర్ బాలికను చంపేసి.. చెట్టుకు వేలాడదీసి..!

సారాంశం

తల్లితోపాటు వెళ్లిన బాలిక.. అనుకోకుండా అక్కడ తప్పిపోయింది. అయితే.. ఈ విషయాన్ని తల్లి గమనించకపోవడం గమనార్హం.

మైనర్ బాలికను అతి దారుణంగా చంపేసి.. అనంతరం ఆమె మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని విదిషాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

12ఏళ్ల మైనర్ బాలిక విదిశలోని అటవీ ప్రాంతానికి రోజూ తన తల్లితో కలిసి వెళ్లేంది. అయితే.. తిరిగి మాత్రం బాలిక రాలేదు. తల్లితోపాటు వెళ్లిన బాలిక.. అనుకోకుండా అక్కడ తప్పిపోయింది. అయితే.. ఈ విషయాన్ని తల్లి గమనించకపోవడం గమనార్హం.

అయితే ఆమె ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో కూరుతు కనిపించకపోవడంతో.. గ్రామస్తులతో కలిసి తండ్రి బాలిక కోసం అడవిలో వెతికినట్లు తెలిపారు. కొన్ని గంటల తరువాత ఆ చిన్నారి మృతదేహం కండువాతో చెట్టుకు వేలాడతూ కనిపించిందని పేర్క్నన్నారు.  అయితే హత్యకు ముందు అత్యాచారం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

సాయి ష్యూర్ మల్టీ న్యూట్రిషియన్ డ్రింక్.. ఎలా తయారుచేస్తారు..? తాగితే ఇన్ని హెల్త్ బెనిఫిట్సా..!
Army: భారత అమ్ములపొదిలో మరో అద్భుతం.. రంగంలోకి డ్రోన్ క్యాచర్ సిస్టమ్. ఎలా పనిచేస్తుందంటే.?