ప్రాణం తీసిన డీజే చప్పుడు!.. బారాత్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బాలుడు.. డాక్టర్లు ఏం చెబుతున్నారు?

Published : May 07, 2022, 02:22 PM IST
ప్రాణం తీసిన డీజే చప్పుడు!.. బారాత్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బాలుడు.. డాక్టర్లు ఏం   చెబుతున్నారు?

సారాంశం

మధ్యప్రదేశ్‌లో ఓ పెళ్లికి వెళ్లిన 18 ఏళ్ల బాలుడు పెళ్లి బారాత్‌లో ఫుల్ డ్యాన్స్ చేస్తూ జోష్ మీద ఉన్నాడు. ఉన్నట్టుండి ముందుస్తు సంకేతమైనా లేకుండా కుప్పకూలిపోయాడు. డాక్టర్ వద్దలకు తీసుకెళ్లగా ఆ చిన్నారి అప్పటికే మరణించాడని తేల్చారు. హై డెసిబిల్స్‌తో, అత్యధిక చప్పుళ్లు అవి డీజే నుంచి అయినా..   ఇతర ఏ పరికరాల ద్వారానైనా వచ్చినప్పుడు మనిషిలోని అంతర్గత అవయవాలు దెబ్బతింటాయని వివరించారు.

భోపాల్: నేడు ఏ వేడుక చేసుకున్నా డీజే పెట్టడం పరిపాటిగా మారింది. బర్త్‌డే మొదలు పెళ్లి వరకు, రాజకీయ, సాంస్కృతిక, ఇతర వేడుకలకూ డీజే ఇప్పుడు సర్వసాధారణం అయింది. ఎక్కడ ఉన్నా లేకున్నా.. పెళ్లి బారాత్‌లో మాత్రం డీజే తప్పనిసరి అనేలా మార్పు వచ్చింది. చాలా మంది జోష్ ఉన్న మ్యూజిక్‌ హై వాల్యూమ్‌లో పెట్టుకుని డీజే బాక్సుల ముందు సంబురాల్లో మునిగిపోతారు. నిషాలో ఊగిపోతుంటారు. ఇక్కడ డీజే చప్పుళ్లకు పరిమితి మెయింటెయిన్ చేసేవారు దాదాపుగా ఉండరు. అక్కడ డ్యాన్స్ చేస్తున్నవారి మూడ్‌ను బట్టి పాటలు, మ్యూజిక్ వాల్యూమ్ ఉంటుంది. కానీ, ఎంత మంచి మ్యూజిక్ అయినా.. అవధులు దాటి వాల్యూమ్‌ పెంచితే మాత్రం ప్రాణాలకు చేటే. మధ్యప్రదేశ్‌లో ఓ 18 ఏళ్ల బాలుడు హై వాల్యూమ్ మ్యూజిక్‌తో డీజే ముందు డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.

ఉజ్జయిన్ జిల్లాకు చెందిన అంబోడియా నివాసి లాల్ సింగ్ తాజ్‌పూర్ వెళ్లి తన మిత్రుడి వివాహానికి హాజరయ్యాడు. పెళ్లి వేడుకలు మాంచి హుషారు మీద సాగుతున్నాయి. పెళ్లి కొడుకు ఊరి నుంచి బారాత్ బయల్దేరింది. లాల్ సింగ్, ఆయన మిత్రులు ఈ బారాత్‌లో జోరుగా డ్యాన్స్ చేశారు. డీజే బాక్సుల వెనుక చిందులు వేస్తూ వీడియోలు రికార్డు చేసుకున్నారు.

అయితే, అప్పుడే ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. డీజే చప్పుళ్లు, సంబురాల మధ్యనే లాల్ సింగ్ ఉన్నట్టుండి, కనీసం ముందస్తుగా ఇసుమంతైనా హెచ్చరిక లేకుండా కుప్పకూలిపోయాడు. లాల్ సింగ్ స్థిమితం కోల్పోయి నేలపై పడిపోయాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే సమీప హాస్పిటల్‌కు లాల్ సింగ్‌ను తీసుకెళ్లారు. కానీ, ఆ హాస్పిటల్ సిబ్బంది లాల్ సింగ్‌ను ఉజ్జయిన్ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందిగా సూచనలు చేశారు. ఉజ్జయిన్ హాస్పిటల్ చేరగానే లాల్ సింగ్ అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పారు.

లాల్ సింగ్ పోస్టుమార్టం రిపోర్టుపై నిపుణులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ 18 ఏళ్ల పిల్లాడి గుండెలో రక్తం గడ్డకట్టినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఉజ్జయిన్ హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్ జితేంద్ర శర్మ ఈ రిపోర్టుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పెళ్లి బారాత్‌లో ఏర్పాటు చేసిన డీజే నుంచి విడుదలైన భారీ శబ్దాల కారణంగా రక్తం గడ్డకట్టి ఉంటుందని తెలిపారు. డీజే ద్వారా లేదా ఇతర దేని ద్వారానైనా భారీ స్థాయిలో మ్యూజిక్ ప్లే చేస్తే అది మన బాడీలో అసాధారణ ఫిజియలాజికల్ రియాక్షన్స్‌ను ప్రేరేపించవచ్చు
అని వివరించారు. శ్రుతి మించిన డెసిబిల్స్ సౌండ్ల ద్వారా మనిషికి ముప్పేనని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ భారీ శబ్దాల కారణంగా గుండె, మెదడు వంటి అంతర్గత అవయవాలు దెబ్బతినవచ్చునని వివరించారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu